
షోరూం వద్ద జనం ఆందోళన
చిత్తూరు: మెగా ఆఫర్ కింద ద్విచక్రవాహనాలు ఇవ్వడానికి డబ్బులు కట్టించుకొని ఒక్కరికీ వాహనం ఇవ్వలేదని పులవురు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో గల హీరో షోరూమ్ వద్ద వందలాది కొనుగోలుదారులు షోరూమ్ సబ్బందితో శనివారం వాగ్వాదానికి దిగారు.
భారత్ స్టేజ్-3 వాహనాలపై మార్చి 31న నగదు డిస్కౌంట్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నగదు చెల్లించి వాహనాలను బుక్ చేసుకున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం వాహనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.