
కొచ్చిన్/బళ్లారి/న్యూఢిల్లీ: బహుభాషా చిత్రం ‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బలవంత మతమార్పిడికి గురై, ఐసిస్‌లో చేరిన కొందరు మహిళలే ఈ సినిమా ఇతివృత్తం. వారం క్రితం సినిమా ట్రయిలర్ రిలీజ్ నాటి నుంచే వివాదం రేగుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వం, విపుల్ షా నిర్మాతగా ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. కర్ణాటకలోని బళ్లారి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ సైతం ఈ సినిమా గురించి ప్రస్తావించడం విశేషం.
స్టేకు కేరళ హైకోర్టు నో
‘ది కేరళ స్టోరీ’ విడుదలపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. సినిమా ట్రయిలర్ ఒక వర్గానికి వ్యతిరేకంగా లేదని పేర్కొంది. ‘ది కేరళ స్టోరీ’లో కొన్ని అంశాలను చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని, కేరళ ప్రతిష్టకు దెబ్బతీసేలా ఉన్నందున విడుదలను అడ్డుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘సన్యాసులు, క్రిస్టియన్ పూజారులు, ఇతరులను కూడా చెడ్డవారిగా చూపించిన ఘటనలు సినిమాల్లో అనేకం ఉన్నాయి. కొందరు మతబోధకులను చెడుగా చూపారనే కారణంతో సినిమాను నిషేధించలేం’అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment