రైతుల ఆందోళనకు డీఎంకే మద్దతు
పళ్లిపట్టు: సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళరైతులు చేపట్టిన ఆందోళనకు డీఎంకే మద్దతు పలికింది. పళ్లిపట్టు సమీపంలోని ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దులోని కుశస్థలి నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మిస్తుండడంతో తమిళ రైతులు వారం రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో చెక్‌డ్యాం నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా డీఎంకే కార్యదర్శి వేణు అధ్యక్షతన మండల కార్యదర్శి జి.రవీంద్ర సమక్షంలో 300 మంది డీఎంకే శ్రేణులు ఆదివారం చెక్‌డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి తమిళ రైతుల ఆందోళనకు తమ మద్దతు తెలిపారు. వేణు మాట్లాడుతూ సరిహద్దులో యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మించి సరిహద్దు గ్రామీణుల మధ్య చిచ్చుపెడుతున్నట్లు తమిళ రైతులకు తీవ్ర నష్టాన్ని ఏర్పరిచే చెక్‌డ్యాం నిర్మాణాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అంతవరకు రైతులకు మద్దతుగా డీఎంకే ఆందోళనలో పాల్గొంటుందని తెలిపారు. జిల్లా డీఎంకే అధ్యక్షుడు పగలవన్, పళ్లిపట్టు పట్టణకార్యదర్శి జ్యోతికుమార్, తిరుత్తణి పట్టణ కార్యదర్శి భూపతి, మండల నాయకులు మునిరత్నం నాయుడు, దేవరాజు, దాస్, తిరుమలైలోకనాథన్, సుధామెహన్ సహా 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.