పీఆర్‌సీ అమలు చేయాల్సిందే
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): అడ్‌హాక్ ఉద్యోగులకు 2010, 2015 పీఆర్‌సీని అమలు చేయాలంటూ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉద్యోగ జేఏసీ నిరసన కార్యక్రమంలో రెండు రోజూ కొనసాగింది. శనివారం కూడా గంట పాటు యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. సోమవారం నుంచి పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగులంతా స్వచ్చందంగా ఆందోళనలో పాల్గొన్నారు.