అచ్యుతాపురం ఎస్ఈజెడ్లోని ఓ సీడ్స్ కంపెనీ వద్ద రెండు వేల మంది మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు.
అచ్యుతాపురం ఎస్ఈజెడ్లోని ఓ సీడ్స్ కంపెనీ వద్ద రెండు వేల మంది మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు. దసరా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాళ్లు ఆందోళన ప్రారంభించారు. అయితే యాజమాన్యం మాత్రం బోనస్ చెల్లించేది లేదని స్పష్టం చేస్తోంది.
దానికితోడు నైట్ షిఫ్ట్ ఉద్యోగులను కూడా యాజమాన్యం నిర్బంధించింది. దాంతో విత్తనాల కంపెనీ వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడ పోలీసు బలగాలను మోహరించారు. ఏ క్షణంలో ఏమవుతుందోనన్న ఉద్రిక్తత ఇక్కడ నెలకొంది.