మాస్కో: మైనారిటీ ఉద్యమ నేత ఫెయిల్ అల్సినోవ్‌కు మద్దతుగా రష్యాలో వందల మంది ఆయన మద్దతు దారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బాష్‌కోర్టోసాన్ ప్రాంతంలో అల్సినోవ్ కోసం భారీ సంఖ్యలో మద్దతుదారులు నిరసనకు దిగారు.
వీరిలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిరసనకారులు వెంటనే ఆందోళన విరమించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
పోలీసులకు, నిరసనకారులకు వాగ్వాదం, తోపులాట జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్సినోవ్‌కు మద్దతుగా ఇది ఈ వారంలో ఆందోళకారులు చేసిన మూడవ నిరసన కావడం గమనార్హం. విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులో అల్సినోవ్‌కు ఇటీవలే నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.
బాష్కిర్ మైనారిటీ వర్గానికి అల్సినోవ్ ఒక హీరో. వారి భాష, సంస్కృతి కోసం అల్సినోవ్ తీవ్ర ఉద్యమం చేశాడు. బాష్కిర్ వర్గం వారు పవిత్రంగా భావించే కొండపై మైనింగ్ జరగకుండా 2020లో ఉద్యమం నడిపి విజయవంతమయ్యాడు. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చిలో జరగనుండగా ఈ నిరసనలు జరుగుతుండటం గమనార్హం.
In #Ufa, #Bashkortostan republic, #Russia, some 1,000 people joined a #protest rally in support of imprisoned activist Fail Alsynov; police are reportedly detaining protesters.
— Alex Kokcharov (@AlexKokcharov) January 19, 2024
pic.twitter.com/u0rn8HBchD
Comments
Please login to add a commentAdd a comment