సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో వీఆర్‌ఏల చర్చలు ముగిశాయి. వీఆర్‌ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీఆర్‌ఏలు ఆందోళన విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్‌ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం వీఆర్‌ఏలు మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌పై తమకు నమ్మకం ఉందన్నారు.
చదవండి: TS: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్‌ఏలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. వీఆర్‌ఏలు ఆందోళన చేపట్టారు అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment