వి.కోట మండలం సుద్దులకుప‍్పం గ్రామస‍్తులు నీటి కోసం బుధవారం ఆందోళనకు దిగారు.
చిత్తూరు: మోటార్లు చెడిపోయినా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని వి.కోట మండలం సుద్దులకుప‍్పం గ్రామస‍్తులు నీటి కోసం బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపైకి చేరుకున‍్న మహిళలు అక్కడే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. గుక‍్కెడు నీటికి నానా అగచాట్లు పడుతున్నామని పేర‍్కొన్నారు.
తాము ఇరవై రోజులుగా నీటి కోసం ఇబ‍్బందులుపడుతున్నామని చెప్పారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని, విద్యుత్ మోటార్లు తరుచూ కాలిపోతున్నా వాటికి మరమ‍్మత్తులు చేయడం లేదని ఆరోపించారు. నీటి సమస‍్య పరిష‍్కరించేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని మహిళలు చెప్పారు. వీరి ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.