లక్నో:పార్లమెంట్ ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు పార్టీలు మారుతూ రాజకీయ వేడిని పెంచుకుతున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఐదు రోజుల కింద డానిష్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆరోజు నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు ఉచ్చాయి.
అనుకున్నట్టుగానే ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి సీట్ల పంపణీలో పొందినట్లు తెలుస్తోంది.
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో డానిష్ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ, విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్ అన్నారు.
మరోవైపు.. ‘కాంగ్రెస్ నేతలతో సన్నిహతంగా ఉంటుంన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు మరచిపోయారు. ఆ కారణంగా డానిష్ అలీని సస్పెండ్ చేస్తున్నాం’ బీఎస్పీ గతేడాది ఆయన సస్పెన్షన్‌పై వివరణ ఇచ్చింది. డానిష్ అలీపై బీఎస్సీ పార్టీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అలీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment