danish
-
వందేళ్ల తర్వాత వేలానికి
కొందరికి నాణేలు, ఇంకొందరికి పోస్టల్ స్టాంప్స్, మరికొందరికి కరెన్సీ. బాల్యంలో సేకరణ చాలామందికి ఓ అభిరుచి. అచ్చం ఇలాగే ఆ డానిష్ వాణిజ్యవేత్తకూ నాణేలంటే పిచ్చి. అందుకే పదీ, ఇరవై కాదు 20వేల నాణేలను సేకరించాడు. అత్యంత ఖరీదైన ఆ నాణేల నుంచి కొన్నింటిని వచ్చే నెలలో వేలం వేయనున్నారు. ఆ నాణేల ప్రత్యేకత ఏమిటి? వందేళ్ల తరువాతే ఎందుకు వేలం వేస్తున్నారు? ఆ విశేషాలు ఓసారి చూద్దాం.. డెన్మార్క్‌కు చెందిన లార్స్ఎమిల్ బ్రూన్ (ఎల్.ఇ.బ్రూన్) భూస్వాముల కొడుకు. అయితే కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని 20 ఏళ్ల వయసులోనే తెలుసుకున్నారు. మరి కొంత రుణం తెచ్చి వెన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అమ్మకాలు, ఎగుమతులతో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అతని మేనమామకు నాణేల సేకరణ ఇష్టం. అది కాస్తా బ్రూన్కు వారసత్వంగా వచి్చంది. చిన్నతనంలో 1859 నుంచే కరెన్సీని సేకరించడం ప్రారంభించారు. సంపన్నుడిగా ఎదిగాక.. అతని నాణేల సేకరణ కూడా సుసంపన్నమయ్యింది. దాదాపు 20వేల అత్యంత విలువైన నాణేలను సేకరించారు. 1885లో డానిష్ న్యూమిస్మాటిక్ (నాణేల సేకరణ, అధ్యయనం) సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా మారారు. 1923లో బ్రూన్ మరణించారు. తన నాణేల సేకరణను వందేళ్లపాటు దాచి ఉంచేలా వీలునామా రాశారు. వింత వీలునామా.. ‘‘ఆరు దశాబ్దాలకు పైగా కూడబెట్టిన విస్తారమైన నాణేలు, నోట్లు, పతకాలు డెన్మార్క్ జాతీయ సేకరణ అత్యవసర రిజర్వ్‌లో ఉంచాలి. అంతా సవ్యంగా ఉంటే.. నా వారసులకు ప్రయోజనం కలిగేలా వందేళ్ల తరువాత వాటిని విక్రయించవచ్చు’’అని బ్రూన్ తన వీలునామాలో పేర్కొన్నారు. నిధిని ఇంతకాలం దాచడానికి ఓ కారణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో విధ్వంసం చూసిన అతను.. తన రాయల్ డానిష్ కాయిన్ అండ్ మెడల్ కలెక్షన్ ఏదో ఒక రోజు బాంబు దాడి ఎదుర్కోవచ్చు లేదా దోపిడీకి గురికావచ్చని భావించారు. అందుకే వందేళ్ల తరువాత అని వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ వందేళ్లు నాణేలను రహస్యంగా ఉంచారు. అవి ఎక్కడున్నాయో చాలా తక్కువ మందికి తెలుసు. గతేడాది ముగిసిన గడువు.. వందేళ్ల గడువు 2023తో ముగిసిపోయింది. బ్రూన్ వ్యక్తిగత 20,000 నాణేల సేకరణ నుంచి మొదటి సెట్ నాణేలు వచ్చే నెలలో వేలానికి రానున్నాయి. బ్రూన్ ఖజానా మొత్తం ఖాళీ కావాలంటే.. అనేక వేలాలు నిర్వహించాలి. వేలం మొత్తం పూర్తయితే ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన అంతర్జాతీయ నాణేల సేకరణ అవుతుందని అరుదైన నాణేల డీలర్, అమ్మకాలను నిర్వహించే వేలం సంస్థ స్టాక్స్ బోవర్స్ తెలిపింది. బ్రూన్ కలెక్షన్ 500 మిలియన్ డానిష్ క్రోనర్ లేదా సుమారు 72.5 మిలియన్ డాలర్లకు బీమా చేసినట్లు వెల్లడించింది. మార్కెట్లోకి వచి్చ న ప్రపంచ నాణేలలో అత్యంత విలువైన సేకరణగా వేలం సంస్థ దీనిని అభివర్ణించింది. అత్యంత ఖరీదైన కింగ్ హాన్స్ నాణెం.. సెప్టెంబర్ 14 న జరిగే మొదటి సేల్ కోసం డెన్మార్క్, నార్వే, స్వీడన్‌కు చెందిన బంగారం, వెండి నాణేలతో సహా 280కి పైగా లాట్లను స్టాక్స్ బోవర్స్ ఉంచనుంది. వీటిలో 15వ శతాబ్దం చివరి నుంచి బ్రూన్ జీవితం చివరి సంవత్సరాల వరకు ఉన్నాయి. వీటి విలువ 10 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఇందులో స్టార్లాట్.. స్కాండినేవియా పురాతన బంగారు నాణేలలో ఒకటి. 1496 నాటి కింగ్ హాన్స్ నాణెం అత్యంత ఖరీదైనది. డెన్మార్క్ ముద్రించిన మొదటి బంగారు నాణెం. దీనిని 600,000 యూరోలు లేదా 672,510 డాలర్లకు విక్రయించవచ్చు. ఈ నాణేలను వివిధ గత కొన్ని నెలలుగా వివిధ ఎగ్జిబిషన్స్‌లో, స్టాక్స్ బోవర్స్ గ్యాలరీలలో ప్రదర్శించారు. అమ్మకానికి ముందు వీటిని కోపెన్‌హాగన్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ సస్పెండెడ్ ఎంపీ
లక్నో:పార్లమెంట్ ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు పార్టీలు మారుతూ రాజకీయ వేడిని పెంచుకుతున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఐదు రోజుల కింద డానిష్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆరోజు నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు ఉచ్చాయి. అనుకున్నట్టుగానే ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి సీట్ల పంపణీలో పొందినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో డానిష్ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ, విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్ అన్నారు. మరోవైపు.. ‘కాంగ్రెస్ నేతలతో సన్నిహతంగా ఉంటుంన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు మరచిపోయారు. ఆ కారణంగా డానిష్ అలీని సస్పెండ్ చేస్తున్నాం’ బీఎస్పీ గతేడాది ఆయన సస్పెన్షన్‌పై వివరణ ఇచ్చింది. డానిష్ అలీపై బీఎస్సీ పార్టీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అలీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. -
ఎంపీ డానిష్ అలీపై బీఎస్పీ బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీని శనివారం బహుజన్ సమాజ్ పార్టి(బీఎస్పీ) సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ మీరు ఎలాంటి ప్రకటన చేయరాదని, ఎటువంటి చర్య తీసుకోవద్దని చాలాసార్లు మౌఖికంగా చెప్పాం. అయినప్పటికీ మీరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం మానలేదు. అందుకే, పార్టీ ప్రయోజనాల రీత్యా మిమ్మల్ని బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’అని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా డానిష్ అలీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అంశంలో కీలక పరిణామం
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, బిధూరి వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పార్టీ అగ్రనాయకత్వం రమేష్ బిధూరికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభా హక్కుల కమిటీకి నివేదించారు. రమేష్ బిధూరి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు విపక్ష ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, వీరి ఫిర్యాదులను బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ సారధ్యంలోని సభా హక్కుల కమిటీకి స్పీకర్ పంపించారు. ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసినందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. लोकसभा अध्यक्ष @ombirlakota जी का आभार,उन्होंने दानिश अली प्रकरण में @LokSabhaSectt की कमिटि को जॉंच का ज़िम्मा सौंपा ।आज यह इसलिए संभव हो पाया क्योंकि लोकसभा में भाजपा का बहुमत है,नहीं तो पहले लोकसभा ने 2006 में RJD-JDU-congress का जूता व माईक मारपीट,2012 में सोनिया गांधी जी की… — Dr Nishikant Dubey (@nishikant_dubey) September 28, 2023 ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి కాషాయ పార్టీ కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్ధాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్గా రమేష్ బిధూరిని నియమించడం పట్ల బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్వేష వ్యాఖ్యలు చేసే వారికి బీజేపీ పట్టం కడుతుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టోంక్‌లో ముస్లిం జనాభా 29 శాతమని, రాజకీయ లబ్ధి కోసం విద్వేష విషం వెదజల్లుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. VIDEO | "I am waiting for the Speaker (Lok Sabha) to take action in this matter. I hope he will definitely take action," says BSP MP @KDanishAli on the issue of derogatory comments made against him by BJP Ramesh Bidhuri in Lok Sabha. pic.twitter.com/ULJKqudtnm — Press Trust of India (@PTI_News) September 28, 2023 ఇది కూడా చదవండి: భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ -
సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఈ వివాదంపై మరో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ మా ఎంపీ చేసింది తప్పే కానీ అంతకుముందు డానిష్ అలీ చేసింది కూడా తప్పేనని దానిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మతపరమైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపాయి. ఇతర పార్టీల ఎంపీల తోపాటు బీజేపీ నాయకులు కూడా రమేష్ బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తుండగా సహచర బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాత్రం బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తూనే డానిష్ అలీని కూడా విచారించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. आज भाजपा के कुछ नेता एक नैरेटिव चलाने का प्रयास कर रहे हैं कि संसद में मैंने श्री रमेश बिदूरी को भड़कया, जबकि सच्चाई यह है कि मैंने प्रधानमंत्री पद की गरिमा को बचाने का काम किया और सभापति जी को मोदी जी से संबंधित घोर आपत्तिजनक शब्दों को सदन की कार्रवाई से हटाने की माँग की थी। pic.twitter.com/s5u0Ptb0Ou — Kunwar Danish Ali (@KDanishAli) September 23, 2023 ఈ సందర్బంగా నిశికాంత్ దూబే ఏమన్నారంటే.. లోక్‌సభలో రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం ఆమోదించదగినవి కాదని, అదే సమయంలో డానిష్ అలీ ప్రధానిని కులం పేరుతో దూషించారు కాబట్టి రమేష్ ఆ విధంగా స్పందించారని.. డానిష్ అలీ వ్యాఖ్యలపై కూడా విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ నియమావళి ప్రకారం ఒక సభ్యుడు మాట్లాడుతుండగా కూర్చుని ఉన్న మరో సభ్యుడు అదేపనిగా అడ్డుపడడం కూడా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. 15 ఏళ్లుగా నేను ఎంపీగా ఉన్నాను కానీ ఇలాంటి ఒకరోజును నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదన్నారు. #WATCH | Delhi: On BJP MP Ramesh Bidhuri's remark, BJP MP Nishikant Dubey says "...The words used by him are not acceptable. I was present in the Parliament when all this took place. BSP MP Danish Ali kept calling PM Modi 'neech'. I have written a letter to Lok Sabha Speaker Om… pic.twitter.com/TIg4A9bc1a — ANI (@ANI) September 23, 2023 నిశికాంత్ దూబే వ్యాఖలపై బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పందిస్తూ.. సభలో నన్ను మొదట మాటాలతో చంపేశారు ఇప్పుడు సభ వెలుపల నన్ను శారీరకంగా చంపాలని చూస్తున్నారన్నారు. ఇక ఈ విషయంపై రమేష్ బిధూరీ స్పందించడానికి నిరాకరించారు.. మొదట డానిష్ ఆలీ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాబట్టే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఏదేమైనా ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది సభాపతి కాబట్టి దానిపై తాను మాట్లాడదలచుకోలేదని చెప్పి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! -
రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రతిపక్ష పారీ్టల నేతలు శనివారం డిమాండ్ చేశారు. బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలని, సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కొందరు స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా, రమేశ్ బిధూరీ వ్యాఖ్యల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ పేర్కొన్నారు. -
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
డెన్మార్క్ పీఎంతో మోదీ చర్చలు
కోపెన్హాగన్: డెన్మార్క్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్తో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సమావేశమై పలు విషయాలను చర్చించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం సహా అనేక అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. మోదీకి డెన్మార్క్‌లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని ఫ్రెడెరిక్సన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తన అధికార నివాసానికి తోడ్కొని వెళ్లి, భారత పర్యటనలో ఆయన తనకిచ్చిన పెయింటింగ్‌ను చూపించారు. మోదీని మంచి స్నేహితుడిగా అభివర్ణించారు. డెనార్క్‌లో పర్యటించిడం మోదీకి ఇదే తొలిసారి. బుధవారం కూడా ఆయన డెన్మార్క్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డెన్మార్క్ రాణి మార్గరెథే2తో సమావేశమవుతారు. అక్కడి భారతీయులతో కలిసి ఇండో డెన్మార్క్ రౌండ్‌టేబుల్ వ్యాపార సమావేశంలో పాల్గొంటారు. డెన్మార్క్‌లో 60కి పైగా భారత కంపెనీలున్నాయి. 16వేల దాకా ప్రవాస భారతీయులున్నారు. ఇండో నార్డిక్ సమావేశం రెండో ఇండియా నార్డిక్ సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ప్రధానులు ఈ సమావేశానికి హాజరవుతారు. 2018లో జరిగిన తొలి ఇండో నార్డిక్ సదస్సు అనంతరం పురోగతిని సమీక్షిస్తారు. ఆర్థిక రికవరీ, శీతోష్ణస్థితి మార్పు, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధన వనరులు, అంతర్జాతీయ భద్రత, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇండో నార్డిక్ సహకారం తదితరాలపై సదస్సు దృష్టి పెడుతుందని మోదీ చెప్పారు. నార్డిక్ ప్రధానులతో మోదీ విడిగా కూడా చర్చిస్తారు. నార్డిక్ దేశాలు, భారత్ మధ్య 2020–21లో 500 కోట్ల డాలర్లకు పైగా వాణిజ్యం జరిగింది. A special start to a special visit. PM @narendramodi was welcomed by PM Frederiksen at Copenhagen. @Statsmin pic.twitter.com/iRnJt6J8k3— PMO India (@PMOIndia) May 3, 2022 యుద్ధం తక్షణం ఆగాలి: మోదీ రష్యా, ఉక్రెయిన్ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని మోదీ పిలుపునిచ్చారు. వెంటనే చర్చలతో సంక్షోభానికి తెర దించాలన్నారు. రష్యాపై ప్రభావం చూపగల భారత్ యుద్ధాన్ని ఆపేందుకు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ ఆశాభావం వెలిబుచ్చారు. భూమికి భారత్ హాని చేయదు! భారత్ పర్యావరణ విధ్వంసకారి కాదని మోదీ అన్నారు. భూ పరిరక్షణ యత్నాల్లో ముందంజలో ఉంటుందని చెప్పారు. భారత్‌లో పునర్వినియోగ ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కాప్ 26 సదస్సుల్లో ఇచ్చిన వాగ్దానాలను వివరించారు. ‘‘2070 నాటికి కర్బన ఉద్గారరహిత దేశంగా రూపొందేందుకు ప్రయత్నిస్తున్నాం. 2030 నాటికి దేశ ఇంధనావసరాల్లో 40 శాతం పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు. ప్రతి ప్రవాస భారతీయుడూ కనీసం ఐదుగురు విదేశీ స్నేహితులు భారత్‌ను సందర్శించేలా ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడు దేశీయ టూరిజానికి పునర్వైభవం వస్తుందన్నారు. వైవిధ్యమే భారత బలం భారతీయ సమాజానికి సమ్మిళిత, సాంస్కృతిక వైవిధ్యమే బలాన్నిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ శక్తితోనే భారతీయులు ప్రతి క్షణం జీవిస్తారని, ఈ విలువలే భారతీయుల్లో వేలాది సంవత్సరాలుగా పెంపొందాయని ఆయన చెప్పారు. డెన్మార్క్‌లోని ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతీయులంతా దేశరక్షణలో భాగస్వాములు కావాలని, జాతి నిర్మాణంలో ప్రతిఒక్కరూ చేతులు కలపాలని ఆయన కోరారు. భారతీయుడు ఏదేశమేగినా ఆ దేశాభివృద్ధికి నిజాయతీగా పనిచేస్తాడన్నారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా పలుమార్లు ప్రాంగణమంతా మోదీ, మోదీ అని మారుమోగింది. తాను పలువురు ప్రపంచ నేతలను కలిసానని, వారంతా తమ దేశాల్లో భారతీయుల విజయాలను తనతో పంచుకునేవారని మోదీ చెప్పారు. ప్రవాస భారతీయుల జనాభా కొన్ని దేశాల మొత్తం జనాభా కన్నా అధికమని గుర్తు చేశారు. కరోనా నియంత్రణలు సడలించిన అనంతరం డెన్మార్క్ ప్రధానినే తొలిసారి భారత్‌కు ఆహ్వానించామని గుర్తు చేశారు. చదవండి: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారుగా తరుణ్ కపూర్ #WATCH | Prime Minister Narendra Modi and Danish PM Mette Frederiksen hold a conversation at the latter's residence in Copenhagen, Denmark. pic.twitter.com/wUGfJBYcOc— ANI (@ANI) May 3, 2022 ‘Walking the talk’ PM @narendramodi and @Statsmin PM Mette Frederiksen at Marienborg. The bonhomie between the two leaders mirrors the close ties between India and Denmark. pic.twitter.com/bdADrUpUUl— Arindam Bagchi (@MEAIndia) May 3, 2022 -
సజన్‌కు స్వర్ణం... వేదాంత్‌కు రజతం
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్లు సజన్ ప్రకాశ్, వేదాంత్ మెరిశారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్ స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తమిళనాడుకు చెందిన వేదాంత్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. సజన్ 200 మీటర్ల లక్ష్యాన్ని ఒక నిమిషం 59.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ 1500 మీటర్ల లక్ష్యాన్ని 15 నిమిషాల 57.86 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ గత ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గగా... జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించాడు. -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ప్రముఖ కమెడియన్
ముంబై : ప్రముఖ నటుడు, స్టాండప్ కమెడియన్ డానిష్ సైత్ ఓ ఇంటివాడయ్యాడు. గ్రాఫిక్ డిజైనర్ అన్య రంగస్వామిని అతికొద్ది మంది బందువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కేవలం 15మంది అతిథుల సమక్షంలో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది ఈ జంట. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను డానిష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..నిన్న మా పెళ్లి జరిగింది. బంధులు, సన్నిహితుల సమక్షంలో అన్య, నేను రింగ్స్ మార్చుకున్నాం. ఎంతో ప్రేమతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మమ్మల్ని ఆశిర్శదించండి అంటూ డానిష్ పోస్ట్ చేశాడు. ఈ కొత్త జంటకు అనుష్క శర్మ, దియా మీర్జా, సునీత కపూర్ సహా పలువురు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. డానిష్ తన పెళ్లి వేడుకకు సంబంధించి పోస్ట్ షేర్ చేసిన వెంటనే డానిష్ సిస్టర్ కుబ్రా సైత్ గుడ్ విషెస్ అందిస్తూ కామెంట్ చేసింది. ఇక పెళ్లి వేడుకకు రాలేకపోయిన వారికోసం లైవ్ ప్రసారం చేశాడు. గతేడాది డిసెంబర్లో డానిష్-అన్య రంగస్వామిల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. డానిష్ సైత్‌ను ఆర్సీబీ జట్టు ఫన్నీ మ్యాన్ 'మిస్టర్ నాగ్స్' అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఆటగాళ్లకు వినోదం, ఆనందాన్ని పంచడమే మనోడి పని. ఆటగాళ్లతో ప్రాంక్స్ కూడా చేస్తుంటాడు. మిస్టర్ నాగ్స్‌గా పేరుగాంచిన డానిష్ సైత్.. ఆర్సీబీకి హెస్ట్, ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంటాడు.నటుడిగా, కమెడియన్‌గానే కాకుండా హోస్ట్‌గా, రచయితగానూ పనిచేశాడు. View this post on Instagram A post shared by Danish sait (@danishsait) చదవండి : తాళి కట్టేముందు ఆ కన్నడ హీరో కాబోయే భార్యను ఏం అడిగాడంటే! నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. -
ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?
లండన్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, సంజయ్ భండారీ.. భారత్ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు. మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్‌కే ఎందుకు ఉడాయిస్తున్నారు ? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంగా ఎలా మారింది ? ఈ ప్రశ్నలకు జవాబుల్ని లండన్‌కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్ ఖాన్, రుహి ఖాన్లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్‌లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్‌కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. -
భర్తకు షాకిచ్చిన ముగ్గురు భార్యలు
లక్నో: ట్రిపుల్ తలాక్ పై ముమ్మరంగా చర్చ సాగుతుండగా అలాంటిదే మరో ఉదంతం వెలుగుచూసింది. అయితే నాలుగో సారి పెళ్లి చేసుకోవాలని ఆశపడిన భర్తకు ముగ్గురు భార్యలు కలిసి షాక్ ఇచ్చారు. తమను మోసగించి నాలుగో నిఖాకు సిద్ధమైన భర్తపై ఆ ముగ్గురూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహ్రయిచ్ ప్రాంతానికి చెందిన దనీష్(30) 2013 లో మొదటి వివాహం చేసుకున్నాడు. ఆమెతో విభేదాలు తలెత్తడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె అశ్లీల చిత్రాలు తన వద్ద ఉన్నాయంటూ పుట్టింటి వారిని వేధించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అనంతరం ఆమెకు తలాక్ చెప్పేసి మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహ బంధం కూడా ఏడాదే నడిచింది. ఇదే సమయంలో రెండో భార్య బంధువుల అమ్మాయి(15) పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె అశ్లీల చిత్రాలు కూడా తనవద్ద ఉన్నాయని, పెళ్లికి అడ్డుపడితే వాటిని బయటపెడతానని ఆమె కుటుంబసభ్యులను బెదిరించి ఆ ఆమ్మాయిని మూడో భార్యగా చేసుకున్నాడు. ఇది చాలక.. ఇటీవల మరో నిఖాకు దనీష్ సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న ముగ్గురు భార్యలు రెండు రోజుల క్రితం అడిషనల్ సూపరింటెండెంట్ దినేష్ త్రిపాఠిని కలిసి తాము పడ్డ అవస్థలను ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన పోలీసులు దినేష్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
గెలిచిన ట్రోఫీతో న్యూడ్ గా...
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన మహిళల హ్యాండ్ బాల్ జట్టు చివరకు గెలుపొందింది. దీంతో ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ, ఏకంగా బాత్ రూంలోని షవర్ కింద జట్టు సభ్యులు ట్రోఫీతో న్యూడ్ గా ఫోజిచ్చారు. గత నాలుగేళ్లలో మూడుసార్లు డెన్మార్క్‌కు చెందిన ట్విస్ హోల్స్టెబ్రో మహిళల హ్యాండ్ బాల్ జట్టు ఈఎచ్ఎఫ్ కప్ కైవసం చేసుకుంది. అయితే ఈ సారి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన హ్యాండ్ బాల్ జట్టు గట్టి పోటీనిచ్చింది. తొలుత రష్యాకు చెందిన మహిళల టీం ఆధిక్యం కనబరిచింది. అయితే చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో డానిష్ మహిళల జట్టు విజయం సాధించింది. దీంతో ఈ ఏడాది కప్ గెలుపును మరచిపోకుండా ఉండటానికి జట్టు సభ్యులైన కొందరు మహిళలు గెలిచిన కప్‌తో న్యూడ్‌గా ఫోటోకి ఫోజిచ్చారు. -
డానిష్ మహిళపై అత్యాచారం కేసులో నిందితుల కస్టడీ పొడగింపు
న్యూఢిల్లీ: డానిష్ పర్యాటకురాలిపై అత్యాచారం కేసులో అరెస్టయిన ఐదుగురిని ఈ నెల 23 వరకు పోలీసు కస్టడీకి తరలిస్తూ స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నిందితులు మహేందర్ ఎలియాస్ గాంజా, మహ్మద్ రజా, రాజుసింగ్, అర్జున్, రాజుకు విధించిన రిమాండ్ ముగిసిపోవడంతో వారిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుధాంశు కౌషిక్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. చిల్లర నేరాలు చేసే వీరంతా ఈ నెల 14న బాధితురాలిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశారని తెలిపారు. అనంతరం ఆమె దగ్గరున్న వస్తువులు, డబ్బు కూడా దోచుకున్నారని వెల్లడించారు.