గెలిచిన ట్రోఫీతో న్యూడ్ గా...
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన మహిళల హ్యాండ్ బాల్ జట్టు చివరకు గెలుపొందింది. దీంతో ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ, ఏకంగా బాత్ రూంలోని షవర్ కింద జట్టు సభ్యులు ట్రోఫీతో న్యూడ్ గా ఫోజిచ్చారు. గత నాలుగేళ్లలో మూడుసార్లు డెన్మార్క్‌కు చెందిన ట్విస్ హోల్స్టెబ్రో మహిళల హ్యాండ్ బాల్ జట్టు ఈఎచ్ఎఫ్ కప్ కైవసం చేసుకుంది.
అయితే ఈ సారి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన హ్యాండ్ బాల్ జట్టు గట్టి పోటీనిచ్చింది. తొలుత రష్యాకు చెందిన మహిళల టీం ఆధిక్యం కనబరిచింది. అయితే చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో డానిష్ మహిళల జట్టు విజయం సాధించింది. దీంతో ఈ ఏడాది కప్ గెలుపును మరచిపోకుండా ఉండటానికి జట్టు సభ్యులైన కొందరు మహిళలు గెలిచిన కప్‌తో న్యూడ్‌గా ఫోటోకి ఫోజిచ్చారు.