
లక్నో: మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయాన్ని కాంగ్రెస్ తొందరగా తేల్చాలని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ స్పందించకుంటే బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ)తో కలిసి పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోబోమని బీఎస్‌పీ ప్రకటించడం తెల్సిందే. ‘పొత్తు విషయంలో కాంగ్రెస్ నిర్ణయం కోసం ఇప్పటికే చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఇలా ఎంత కాలం వేచి చూడాలి? అని ప్రశ్నించారు. బీఎస్‌పీతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్న గోండ్వానా గణతంత్ర పార్టీతో చర్చలు జరుపుతామన్నారు.