ఖాతా తెరిచిన బీఎస్పీ | BSP party account opend with assembly seats in telangana | Sakshi
Sakshi News home page

ఖాతా తెరిచిన బీఎస్పీ

Published Sat, May 17 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM

BSP party account opend with assembly seats in telangana

నిర్మల్, న్యూస్‌లైన్ : జిల్లాలో జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) తన ఖాతా తెరిచింది. జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన సత్తాను మరోసారి చాటారు. బీఎస్పీ నిర్మల్ అసెంబ్లీ అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బీఎస్పీ  సిర్పూర్ అభ్యర్థిగా కోనేరు కోనప్పలు గెలుపొంది ప్రత్యేక గుర్తింపు పొందారు.

 జిల్లాతోపాటు తెలంగాణలో బీఎస్పీ తన ఖాతా తెరిచింది. నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావుపై 8,628 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక సిర్పూర్‌లో కోనేరు కోనప్ప తన సమీప అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జిల్లాలో ఇప్పటి వరకు బీఎస్పీ విజయం సాధించిన దాఖలాలు లేవు. అయితే ఐకే.రెడ్డి ఆ పార్టీ నుంచి పోటీ చేయడంతోపాటు అదే బాటలో కోనేరు కోనప్ప సైతం నడిచి పార్టీ గుర్తును రెండు నియోజకవర్గాలో ఎగురవేసి తమ పేరును నిలుపుకున్నారు. తద్వారా జిల్లాలోనే కాకుండా త్వరలో ఏర్పడే   తెలంగాణ రాష్ట్రంలోనూ పాగా వేసినట్లయింది.

 సత్తా నిరూపించుకున్న ఐకేరెడ్డి...
 జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మరోసారి తన సత్తా నిరూపించుకున్నారు. 1987లో జెడ్పీ చైర్మన్‌గా, 1991-96 వరకు ఎంపీగా, 1999, 2004లో ఎమ్మెల్యేగా, 2008లో ఎంపీగా పనిచేసిన ఆయ న 2000 సంవత్సరంలో టీసీఎల్‌ఎఫ్ కన్వీనర్‌గానూ వ్యవహరించారు. ఇటీవల జరిగిన రాజ కీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీ నామా చేసిన ఐకే.రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీలో చేరారు. అనంతరం పార్టీని వీడి కొన్ని రోజులపాటు ఏ పార్టీలోకి వెళ్లకుండా తటస్థంగా ఉంటూ వచ్చారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా తన అనుచరులందరికీ ఒకే గుర్తు రావలన్న ఉద్దేశంతో బీఎస్పీ నుంచి టిక్కెట్లు తీసుకొచ్చి వారిని బరిలో నిలపడమే కాకుండా 16 సీట్లలో పార్టీ గెలుపునకు పాటుపడ్డారు.

 మున్సిపల్ చైర్మన్ స్థానాన్నీ కైవసం చేసుకోబోతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి నియోజకవర్గంలో 14 స్థానాలను కైవసం చేసుకున్నారు. అనంతరం ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయ గురువుగా ఐకే.రెడ్డిని భావించే కోనేరు కోనప్ప సైతం బీఎస్పీ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన అనుచర గణాన్ని బరిలో నిలిపి ఒక జెడ్పీటీసీతోపాటు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యేగానూ కోనప్ప విజయబావుటా ఎగురవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement