Indra karan Reddy
-
రాజుకున్న రాజకీయ వేడి
సాక్షి, వరంగల్: వారిద్దరు అధికారి పార్టీ నాయకులు.. కానీ ఒకరంటే ఒకరికి పడదని ఆరోపణలు బయటకు పొక్కుతున్నాయి. వారి మధ్య సయోధ్య కుదురడం లేదనే తెలిసింది. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మ న్ పుట్ట మధుకర్, కాళేశ్వరాలయ మాజీ చైర్మ న్ బొమ్మెర వెంకటేశం మధ్య వైరం తీవ్రస్థాయికి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోమారు వరించిన అదృష్టం.. కాళేశ్వరాలయ పాలక మండలి గడువు ముగియండతో కొత్త పాలకవర్గం నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేటకు చెందిన బొమ్మెర వెంకటేశం సీఎం కేసీఆర్‌కు బాల్యమిత్రుడు కావడంతో రెండోసారి కూడా అవకాశం కల్పించారు. అయితే స్థానికంగా ఉన్న నాయకులను కాదని స్థానికేతరుడికి వరుసగా రెండుసార్లు అవకాశాలు కల్పించారని పుట్ట మధుకర్ మనోవేదనకు గురైనట్లు తెలిసింది. క్రితం సారి కూడా పుట్ట మధు మంథని నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన అనుచరుడికి కాళేశ్వరాలయ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని ఆశించారు. కానీ కేసీఆర్ స్నేహితుడి రూపంలో భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో మధుకర్ అనుచరుడు కాటారంకు చెందిన లచ్చిరెడ్డికి ఆలయ చైర్మన్ పదవి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ల మధ్య దూరం పెరుగుతూ వస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. తన అనుచరుడిని కాదని ఇతర జిల్లాకు చెందిన వ్యక్తికి పదవి కట్టబెట్టడంతో పుట్ట మధుకర్ అప్పటి చైర్మన్ వెంకటేశంపై విముఖతతో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నేటి కార్యక్రమం వాయిదా.. నేటి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ముఖ్యులకు కాబోయే చైర్మన్ బొమ్మెర వెంకటేశం ఆహ్వానాలు పంపారు. హంగుఆర్భాటాలతో ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇదంతా జరుగుతున్నా టీఆర్ఎస్ మంథ«ని నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌కు ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని పాలకమండలి కనీసం ఫోన్ ద్వారాకూడా తెలుపలేదు. ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే వద్దకు ఈఓ మారుతి, డైరెక్టర్ల బృందంతో కలిసి వెంకటేశం వెళ్లారు. ఆయన నివాసంలో వెంకటేశం ఒంటెత్తు పోకడపైన మధుకర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంత సేపు తన ఆలయం నిర్వహణ బాధ్యతలు సరిగా చేపట్టలేదని తన నియోజకర్గంలో కూడా చైర్మన్ పదవికి అర్హులు ఉన్నట్లు ఆయనతో బాహాటంగానే పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. తమకు ముందస్తుగా ఆహ్వానం లేనందున ఇతర కార్యక్రమాలు ఉండడంతో జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి మరో తేదీని నిర్ణయిస్తామని తెలిపి పంపారు. ప్రమాణ స్వీకారం వాయిదా వేయాలని ఈఓ, డైరెక్టర్లకు సూచించారు. ఆదిలోనే అడ్డంకులు ప్రమాణ స్వీకారం ఈనెల 14న సోమవారం ఉదయం 10.12గంటలకు చేయాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పాలకమండలికి ఆదిలోనే అడ్డంకులు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య వైరం ఒక్కసారిగా బయటకు పొక్కింది. దీనిపై మండలంతో పాటు మంథని నియోజకవర్గం స్థాయిలో చర్చ సాగుతోంది. కాగా పాలకమండలిలో 15 మంది డైరెక్టర్లు ఉండగా 13మంది డైరెక్టర్లు పుట్ట మధుకర్‌కు చెందివారు కాగా కాబోయే చైర్మన్ వెంకటేశం మాత్రమే సీఎం అనుచరుడిగా బరిలో ఉన్నారు. మరొక్కరు ఎక్స్‌అపీషియో మెంబర్‌గా అర్చకుడిని తీసుకోనున్నారు. కాగా కాళేశ్వరాలయంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. -
ఆలయాల నిర్మాణానికి రూ. 50 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బలహీనవర్గాల కాలనీల్లో నిర్మిం చే ఆలయాలకు రూ.10 లక్షల వరకు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ లేకుండానే కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులు మంజూరు చేయనున్నట్లు దేవా దాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులు, సీజీఎఫ్ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీజీఎఫ్ ద్వారా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరిం గ్ అధికారులకు సీజీఎఫ్ పనులు అప్పగించిన చోట సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తయ్యేలా చూ డాలని సూచించారు. 165 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు సీజీఎఫ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ధూప దీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు గౌరవ వేతనం చెల్లించేందుకు రూ.27 కోట్లను కమిటీ మంజూరు చేసినట్లు వెల్లడించారు. వేదపాఠశాల నిర్వహణకు ఏడాదికి రూ. కోటి కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, సీజీఎఫ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా పని చేయాలి ప్రభుత్వం అర్చకుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అర్చక, ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. -
ఖాతా తెరిచిన బీఎస్పీ
నిర్మల్, న్యూస్‌లైన్ : జిల్లాలో జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) తన ఖాతా తెరిచింది. జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన సత్తాను మరోసారి చాటారు. బీఎస్పీ నిర్మల్ అసెంబ్లీ అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బీఎస్పీ సిర్పూర్ అభ్యర్థిగా కోనేరు కోనప్పలు గెలుపొంది ప్రత్యేక గుర్తింపు పొందారు. జిల్లాతోపాటు తెలంగాణలో బీఎస్పీ తన ఖాతా తెరిచింది. నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావుపై 8,628 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక సిర్పూర్లో కోనేరు కోనప్ప తన సమీప అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జిల్లాలో ఇప్పటి వరకు బీఎస్పీ విజయం సాధించిన దాఖలాలు లేవు. అయితే ఐకే.రెడ్డి ఆ పార్టీ నుంచి పోటీ చేయడంతోపాటు అదే బాటలో కోనేరు కోనప్ప సైతం నడిచి పార్టీ గుర్తును రెండు నియోజకవర్గాలో ఎగురవేసి తమ పేరును నిలుపుకున్నారు. తద్వారా జిల్లాలోనే కాకుండా త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలోనూ పాగా వేసినట్లయింది. సత్తా నిరూపించుకున్న ఐకేరెడ్డి... జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మరోసారి తన సత్తా నిరూపించుకున్నారు. 1987లో జెడ్పీ చైర్మన్‌గా, 1991-96 వరకు ఎంపీగా, 1999, 2004లో ఎమ్మెల్యేగా, 2008లో ఎంపీగా పనిచేసిన ఆయ న 2000 సంవత్సరంలో టీసీఎల్‌ఎఫ్ కన్వీనర్‌గానూ వ్యవహరించారు. ఇటీవల జరిగిన రాజ కీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీ నామా చేసిన ఐకే.రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీలో చేరారు. అనంతరం పార్టీని వీడి కొన్ని రోజులపాటు ఏ పార్టీలోకి వెళ్లకుండా తటస్థంగా ఉంటూ వచ్చారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా తన అనుచరులందరికీ ఒకే గుర్తు రావలన్న ఉద్దేశంతో బీఎస్పీ నుంచి టిక్కెట్లు తీసుకొచ్చి వారిని బరిలో నిలపడమే కాకుండా 16 సీట్లలో పార్టీ గెలుపునకు పాటుపడ్డారు. మున్సిపల్ చైర్మన్ స్థానాన్నీ కైవసం చేసుకోబోతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి నియోజకవర్గంలో 14 స్థానాలను కైవసం చేసుకున్నారు. అనంతరం ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయ గురువుగా ఐకే.రెడ్డిని భావించే కోనేరు కోనప్ప సైతం బీఎస్పీ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన అనుచర గణాన్ని బరిలో నిలిపి ఒక జెడ్పీటీసీతోపాటు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యేగానూ కోనప్ప విజయబావుటా ఎగురవేశారు.