యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేత కాల్చివేత | UP BJP Leader Shot Dead During Morning Walk | Sakshi
Sakshi News home page

యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేత కాల్చివేత

Aug 11 2020 11:10 AM | Updated on Aug 11 2020 11:34 AM

UP BJP Leader Shot Dead During Morning Walk - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బాగ్‌పత్‌ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు గుర్తుతెలియ‌ని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం ఉదయం.. తన పోలానికి నడుచుకుంటూ వెళ్తుండగా అతడిపై కాల్పులకు దిగారు. ఈ సంఘటన బాగ్‌పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ ప‌రిధిలో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. (చదవండి : వైట్‌హౌజ్‌ పరిసరాల్లో కాల్పుల కలకలం)

ఘ‌ట‌న  జ‌రిగి‌న స‌మ‌యంలో సంజయ్ ఖోఖర్ ఒంటరిగా వెళుతున్నార‌ని తెలుస్తోంది. స‌మాచారం అంతుకున్న వెంటనే పోలీసుల‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. విచారణను వేగవంతం చేసి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అధికారులను ఆదేశించారు. కాగా, ఇదే ప్రాంతంలో గత నెలలో రాష్ట్రీయ లోక్‌దళ్‌ నాయకుడు దేశ్‌పాల్‌ ఖోఖర్‌ను కూడా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement