వీడియో దృశ్యం
లక్నో : గంగానదిలో వందకుపైగా కోవిడ్ మృతదేహాలు తేలుతూ కనిపించటంతో దేశవ్యాప్తంగా కల్లోలం చెలరేగింది. ఆ ఘటన మరువక ముందే కోవిడ్ మృతదేహాలకు సంబంధించిన మరో ఘటన ప్రస్తుతం దుమారం రేపుతోంది. వివరాలు.. ఉత్తర ప్రదేశ్, భల్లియ జిల్లాలోని మల్దెపూర్ ఘాట్‌లో రెండు కోవిడ్ శవాలు కనిపించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అక్కడకు చేరుకున్న పోలీసులు శవాలను బయటకు తీయించారు. వాటిని దహనం చేయించే ఏర్పాటు చేశారు. అయితే వాటిని కాల్చడానికి పెట్రోలు, టైర్లను ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఉన్నతాధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు.
సంఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. దర్యాప్తుకు ఆదేశించారు. కాగా, గంగానదిలో కోవిడ్ మృతదేహాల ఘటనపై సీఎం యోగీ ఆధిత్యనాథ్ కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ.. గంగానదిలో కోవిడ్ మృతదేహాలను వేయకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. నదిలో కనిపించిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment