Yamuna River Crosses Danger Mark Once Again In Delhi - Sakshi
Sakshi News home page

Yamuna River Floods: మరోసారి యమునా నది ఉగ్రరూపం.. కేజ్రీవాల్‌ సర్కార్‌ అలర్ట్‌

Published Sun, Jul 23 2023 12:14 PM | Last Updated on Sun, Jul 23 2023 12:30 PM

Yamuna River Crosses Danger Mark In Delhi - Sakshi

ఢిల్లీ: ఉత్తరాదిన వానలు దండికొడుతున్నాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమ్తమైంది. 

వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని హత్నికుండ్‌ బరాజ్‌నుంచి ప్రభుత్వం 2 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. దీంతో, దిగువన ఉన్న ఢిల్లీకి వరద పోటెత్తింది. ఈ క్రమంలో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. మరోసారి రికార్డు స్థాయిలో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. 

ఈ సందర్బంగా యమునా నది ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది ప్రభుత్వం. ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్‌ సర్కార్ స్పష్టం చేసింది. అయితే గత కొన్నిరోజులుగా ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి తగ్గినప్పటికీ.. మళ్లీ పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 13న యమునా నది 208.66 మీటర్లు ప్రవహించింది. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. 

ఇది కూడా చదవండి: వీడియో: బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్‌గంగ.. 20కిమీ మేర ట్రాఫిక్‌ జామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement