
ఆగ్రాలో తాజ్‌మహల్ వెంట ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది
న్యూఢిల్లీ: ఢిల్లీలో కుంభవృష్టి వర్షాలు లేకున్నా ఎగువప్రాంతాల నుంచి యమునా నది మోసుకొచి్చన వరదనీటితో అల్లాడిపోయిన దేశ రాజధాని నెమ్మదిగా తెరిపినపడుతోంది. గురువారం రాత్రి అత్యంత ప్రమాదకరంగా 208.66 మీటర్లుగా ఉన్న నది నీటిమట్టం శనివారం ఉదయం పదిగంటలకు 207.43 మీటర్లకు తగ్గడమే ఇందుకు కారణం. వరదముంపు ప్రాంతాల్లో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయని డివిజనల్ కమిషనర్ అశ్వనీ కుమార్ చెప్పారు. ‘అవిశ్రాంతంగా శ్రమిస్తున్న అధికారులపై ఎన్నికైన ‘ప్రభుత్వం’ విమర్శలు చేయడం తగదు.
ఇది అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది’ అని ఆప్ సర్కార్‌నుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. హరియాణాలోని హాతీ్నకుండ్ బ్యారేజీ నుంచి వరదనీటి ఔట్‌ఫ్లో తగ్గడంతో ఢిల్లీ పరిసరప్రాంతాల్లో వరదప్రభావం గంట గంటకు తగ్గుతోంది. అయితే భారతవాతావరణ శాఖ మాత్రం ఢిల్లీలో వచ్చే రెండ్రోజులు వర్షాలు పడతాయని సూచించింది. భీకరవర్షాల బారిన పడిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మరో ఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలుపడే అవకాశం ఉందని అంచనావేసింది. దీంతో యమునా నీటిమట్టం మళ్లీ పెరుగుతుందనే భయాలు ఢిల్లీవాసుల్లో వ్యక్తమయ్యాయి.
ఆక్రమణలే ముంచాయి
ఢిల్లీలో వరదకు కారణం నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణ అని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీనియర్ అధికారి ఒకరు విశ్లేíÙంచారు. ‘గతంలో వరదనీరు విస్తారమైన ప్రాంతం గుండా ప్రవహించేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఆక్రమణలతో ఇరుకైపోయింది. దీంతో ఇరుకుదారుల్లో ఎత్తుగా ప్రవహించి సుదూర ప్రాంతాలను వరదముంచెత్తింది. గతంతో పోలిస్తే ఈఏడాది హత్నీకుండ్ బ్యారేజీ నుంచి నీరు ఢిల్లీకి చాలా తక్కువ సమయంలో, ఎక్కువ పరిమాణంలో చేరుకుంది’ అని అధికారి విశ్లేíÙంచారు. ‘ యమున ఎగువ ప్రాంతం మొత్తంలో ఒకేసారి భారీవర్షాలు పడటం ఈసారి పెద్ద వరదకు మరో కారణం’ అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) భారత ప్రతినిధి యశ్‌వీర్ భట్నాగర్ చెప్పారు.