downfalls
-
Anil Ambani: దెబ్బ మీద దెబ్బ.. పట్టిందల్లా పతనం!
-
కాస్తంత తగ్గిన యమున నీటి మట్టం.. కోలుకుంటున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కుంభవృష్టి వర్షాలు లేకున్నా ఎగువప్రాంతాల నుంచి యమునా నది మోసుకొచి్చన వరదనీటితో అల్లాడిపోయిన దేశ రాజధాని నెమ్మదిగా తెరిపినపడుతోంది. గురువారం రాత్రి అత్యంత ప్రమాదకరంగా 208.66 మీటర్లుగా ఉన్న నది నీటిమట్టం శనివారం ఉదయం పదిగంటలకు 207.43 మీటర్లకు తగ్గడమే ఇందుకు కారణం. వరదముంపు ప్రాంతాల్లో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయని డివిజనల్ కమిషనర్ అశ్వనీ కుమార్ చెప్పారు. ‘అవిశ్రాంతంగా శ్రమిస్తున్న అధికారులపై ఎన్నికైన ‘ప్రభుత్వం’ విమర్శలు చేయడం తగదు. ఇది అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది’ అని ఆప్ సర్కార్నుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. హరియాణాలోని హాతీ్నకుండ్ బ్యారేజీ నుంచి వరదనీటి ఔట్‌ఫ్లో తగ్గడంతో ఢిల్లీ పరిసరప్రాంతాల్లో వరదప్రభావం గంట గంటకు తగ్గుతోంది. అయితే భారతవాతావరణ శాఖ మాత్రం ఢిల్లీలో వచ్చే రెండ్రోజులు వర్షాలు పడతాయని సూచించింది. భీకరవర్షాల బారిన పడిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మరో ఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలుపడే అవకాశం ఉందని అంచనావేసింది. దీంతో యమునా నీటిమట్టం మళ్లీ పెరుగుతుందనే భయాలు ఢిల్లీవాసుల్లో వ్యక్తమయ్యాయి. ఆక్రమణలే ముంచాయి ఢిల్లీలో వరదకు కారణం నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణ అని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీనియర్ అధికారి ఒకరు విశ్లేíÙంచారు. ‘గతంలో వరదనీరు విస్తారమైన ప్రాంతం గుండా ప్రవహించేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఆక్రమణలతో ఇరుకైపోయింది. దీంతో ఇరుకుదారుల్లో ఎత్తుగా ప్రవహించి సుదూర ప్రాంతాలను వరదముంచెత్తింది. గతంతో పోలిస్తే ఈఏడాది హత్నీకుండ్ బ్యారేజీ నుంచి నీరు ఢిల్లీకి చాలా తక్కువ సమయంలో, ఎక్కువ పరిమాణంలో చేరుకుంది’ అని అధికారి విశ్లేíÙంచారు. ‘ యమున ఎగువ ప్రాంతం మొత్తంలో ఒకేసారి భారీవర్షాలు పడటం ఈసారి పెద్ద వరదకు మరో కారణం’ అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) భారత ప్రతినిధి యశ్వీర్ భట్నాగర్ చెప్పారు. -
ఉత్పత్తి కోతలతో చమురు ధరలకు సెగ
ప్యారిస్: చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌ప్లస్ .. ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడం వల్ల ప్రపంచ ఎకానమీకి రిస్కులు పొంచి ఉన్నాయని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అధిక స్థాయుల్లో ఉన్న ఇంధన ధరలు.. దీని వల్ల మరింతగా ఎగిసే అవకాశం ఉందని, భారత్ వంటి దేశాలకు చమురు దిగుమతుల భారం భారీగా పెరిగిపోవచ్చని తెలిపింది. సరఫరా తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున 2023 ద్వితీయార్ధంలో అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలో కొరత నెలకొనవచ్చని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతిహ్ బిరోల్ పేర్కొన్నారు. ‘ప్రపంచ ఎకానమీ ఇంకా బలహీనంగానే ఉండటంతో పాటు పలు వర్ధమాన దేశాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చమురు ఉత్పత్తి కోతల నిర్ణయం వల్ల అంతర్జాతీయ ఎకానమీకి రిస్కులు ఎదురవుతాయని భావిస్తున్నాను‘ అని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సమావేశాల కోసం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌తో సమావేశం అనంతరం బిరోల్ ఈ విషయాలు వివరించారు. భారత ఎకానమీ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత బలంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని బిరోల్ చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షల ప్రభావం గురించి మాట్లాడుతూ ఆ దేశ ఆదాయాలను తగ్గించాలన్న లక్ష్యం సాకారమైందని తెలిపారు. చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే, వినియోగించుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ 85 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో ఆయిల్ దిగుమతులపై 118 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చిలో ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ 76.3 లక్షల చదరపు అడుగులు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 34 శాతం తగ్గుదల అని రియల్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ‘2023 జనవరి–మార్చిలో నికర లీజింగ్ ఆరు త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, కొనసాగుతున్న హైబ్రిడ్ పని విధానం కారణంగా కార్పొరేట్ కంపెనీలు విస్తరణపై ఆచితూచి వ్యవహరించడమే ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ ఖర్చులకు తగ్గించుకోవడానికి కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. నికర లీజింగ్ చెన్నై 50 శాతం పడిపోయి 6 లక్షల చదరపు అడుగులు, హైదరాబాద్ 85 శాతం తగ్గి 5.2 లక్షలు, ముంబై 39% క్షీణించి 8.8 లక్షలు, పుణే 44% తగ్గి 12.8 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ 47% దూసుకెళ్లి 19.6 లక్షల చదరపు అడుగులు, బెంగళూరు 14% పెరిగి 19.1 లక్షలు, కోల్‌కతా రెండింతలై 4.6 లక్షల చదరపు అడుగుల నికర లీజింగ్ నమోదైంది. ఈ నగరాల్లో నికర లీజింగ్ 2022 జనవరి–మార్చిలో 1.15 కోట్ల చదరపు అడుగులు ఉంది. సాంకేతిక పరిశ్రమలో మందగమనం ఉన్నప్పటికీ ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ స్థిరంగా ఉంటుంది. 2022 మాదిరిగా ఈ ఏడాది 3.6–4 కోట్ల చదరపు అడుగులు అంచనా వేస్తున్నాం. మరో త్రైమాసికం తర్వాత ఆఫీస్ డిమాండ్ ఎలా ఉంటుందనే అంశంలో స్పష్టత వస్తుంది’ అని జేఎల్ఎల్ వివరించింది. -
మెటల్, ఇంధన షేర్లు డీలా
ముంబై: మెటల్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రూడాయిల్ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీలపై మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్సీఐ) వెయిటేజీ తగ్గింపు, ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంలో ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా పూర్తిగా వాటా విక్రయం అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ట్రేడింగ్‌లో 272 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 124 పాయింట్లు పతనమై 60,683 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 17,856 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 17,781 వద్ద కనిష్టాన్ని, 17,877 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. రియల్టీ, వినిమయ, మౌలిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,458 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.291 కోట్లను విక్రయించారు. ఎంఎస్సీఐ వెయిటేజ్ తగ్గింపుతో అదానీ గ్రూప్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలపడి 82.51 స్థాయి వద్ద స్థిరపడింది. -
దేశంలో తగ్గిన పెట్రోల్, డీజిల్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో నెలవారీగా మందగమన ధోరణి కనబడుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, ఆగస్టు (జూలైతో పోల్చితే) మొదటి 15 రోజుల కాలంలో డీజిల్ డిమాండ్ తగ్గింది. పెట్రోల్ డిమాండ్ దాదాపు అక్కడక్కడే ఉంది. జూన్‌తో పోల్చితే జూలైలో అటు పెట్రోల్ ఇటు డీజిల్ డిమాండ్ రెండూ తగ్గిన సంగతి తెలిసిందే. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వినియోగం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుతుపవనాల ప్రారంభకాలం, ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ఎఫెక్ట్ దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో రవాణా, ట్రావెల్ రంగాలు సహజంగా నెమ్మదిస్తాయి. తీవ్ర వర్షాలు వ్యవసాయ రంగం కార్యకలాపాలకు సైతం అడ్డంకిగా నిలుస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ డీజిల్ డిమాండ్ 3.17 మిలియన్ టన్నులు. అయితే ఆగస్టు ఇదే కాలంలో డిమాండ్ 11.2 శాతం పడిపోయి 2.82 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. ► ఇక జూలై మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.28 మిలియన్ టన్నులు. ఆగస్టు ఇదే రోజుల్లో ఈ పరిమాణం దాదాపు అక్కడక్కడే 1.29 మిలియన్ టన్నులుగా ఉంది. ► జూన్‌తో పోల్చితే జూలై నెలలో డీజిల్ వినియోగం 13.1 శాతం తగ్గి 6.44 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో డీజిల్ విక్రయాలు 7.39 మిలియన్ టన్నులు. ఇక పెట్రోల్ వినియోగం జూలైలో 5 శాతం తగ్గి 2.66 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో పెట్రోల్ వినియోగం 2.8 మిలియన్ టన్నులు. ► వార్షికంగా చూస్తే పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో గణనీయమైన వృద్ధిరేటు నమోదవుతోంది. -
ఎగుమతుల క్షీణత... వాణిజ్యలోటు తీవ్రత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది. -
మళ్లీ ఒమిక్రాన్ భయాలు
ముంబై: ఒమిక్రాన్ భయాలు మరోసారి తెరపైకి రావడంతో స్టాక్ మార్కెట్లో మరోసారి లాభాల స్వీకరణ చోటుకుంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు మూడు నుంచి ఒకటిన్నర శాతం క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరసగా పదో ట్రేడింగ్ సెషన్లో విక్రయాలు చేపట్టారు. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 765 పాయింట్లు నష్టపోయి 58000 దిగువున 57,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205 పాయింట్లు పతనమైన 17,197 వద్ద నిలిచింది. దీంతో సూచీల రెండు రోజుల ర్యాలీకి అడ్డకట్టపడింది. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెలువెత్తాయి. నష్టాల మార్కెట్లోనూ చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అరశాతం లాభపడింది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ ఎల్అండ్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మాత్రమే లాభంతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,356 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.1649 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 75.16 వద్ద స్థిరపడింది. గత రెండు వారాలు నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారంలో లాభాల్ని మూటగట్టుకున్నాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 589 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు లాభపడింది. టెగా ఐపీవో సూపర్‌హిట్!! మైనింగ్ రంగానికి అవసరమయ్యే ఉత్పత్తుల తయారీ సంస్థ టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) భారీ స్థాయిలో ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఆఖరు రోజున 219.04 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎక్సే్ఛంజీల గణాంకాల ప్రకారం 95,68,636 షేర్లను విక్రయానికి ఉంచగా 2,09,58,69,600 షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల కేటగిరీ 666 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) విభాగం 215 రెట్లు, రిటైల్ వ్యక్తిగత ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) కేటగిరీ 29 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
బ్రస్సెల్స్/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. పతనమైన సెన్సెక్స్.. భారీగా నష్టపోయిన మదుపరులు.. పెరిగిన ముడి చమురు ధరలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు.. వీటన్నంటికీ కారణం ఒకేఒక్క కొత్త రకం కరోనా వైరస్. అదే బి.1.1.529. ఆఫ్రికా ఖండం బోట్స్వానా దేశంలో బయటపడిన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్యమంత్రి జెన్స్ స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్‌కు ఉందన్న సమాచారం బెంబేలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులంటున్నారు. కరోనా టీకా తీసుకున్నా కొత్త వేరియంట్ జనాభాలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. తమ దేశంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. మలావీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ బయటపడిందని వెల్లడించింది. అతడితోపాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపింది. వీరు గతంలో టీకా తీసుకున్నారంది. ఆంక్షలు వద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ బి.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొత్త వేరియంట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని, భయాందోళనలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ భరోసానిచ్చారు. దేశాలు సరిహద్దులను మూసివేయొద్దని, ప్రయాణాలపై ఆంక్షలు సరికాదని సూచించారు. మైఖేల్ ర్యాన్ వినతిని బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను నిలిపివేసినట్లు జర్మనీ ప్రకటించింది. కేవలం జర్మన్ పౌరులు మాత్రం రావొచ్చని, స్వదేశానికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని ఇటలీ ఆరోగ్య శాఖ చెప్పింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తమ పౌరులు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. బోట్స్వానా, ఎస్వాటినీ, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వారిపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్ సంగతేంటి? ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదే శాలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సలహాదారుల ప్రత్యేక భేటీ బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహాదారుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 గురించి తమకు పెద్దగా తెలియదని, కానీ, ఇందులో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని సాంకేతిక సలహా బృందం సభ్యుడు మారియావాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్ల పనితీరు తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమన్నారు. బి.1.1.529 వేరియంట్‌పై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని సాంకేతిక సలహా బృందం చైర్మన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. -
మార్కెట్లో బేర్ మండే
ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్ మరోసారి ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఫలితంగా సూచీలు గడిచిన ఏడు నెలలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. మూడు వ్యవసాయ చట్టాల అమలుపై కేంద్రం వెనక్కి తగ్గడంతో పాటు సౌదీ ఆరామ్కో – రిలయన్స్ ఒప్పందం రద్దు కావడంతో మార్కెట్‌కు షాక్ తగిలింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రకంపనలు, ప్రపంచ మార్కెట్లలో బలహీనతలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీతో సెన్సెక్స్ 1,170 పాయింట్లు నష్టపోయి 58,466 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 348 పాయింట్లు క్షీణించి 17,417 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. వ్యవసాయ చట్టాల రద్దుతో ప్రభుత్వ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అధికంగా అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు.., నిఫ్టీ 50 షేర్లలో ఎనిమిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3439 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ.2051 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొమ్మిది పైసలు బలహీనపడి 74.39 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! ఉదయం సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 59,710 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 17,796 వద్ద ప్రారంభమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్నిరంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1625 పాయింట్లు క్షీణించి 58,011 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఇంట్రాడేలో 17,280 వద్ద కనిష్టాన్ని, 17,805 వద్ద గరిష్టాన్ని తాకింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► గత గురువారం లిస్టయిన ఫిన్‌టెక్ పేటీఎం షేర్లు పతనం కొనసాగింది. ఇంట్రాడేలో 19 శాతం క్షీణించి రూ.1,271 వద్ద దిగివచ్చింది. చివరికి 13 శాతం నష్టంతో రూ.1,360 వద్ద స్థిరపడింది. అధిక వ్యాల్యూయేషన్ల ఆందోళనలు పేటీఎం షేర్ల అమ్మకానికి ప్రేరేపించినట్లు నిపుణులు తెలిపారు. ఇష్యూ ధర రూ.2,150 పోలిస్తే కంపెనీ రెండురోజుల్లో 37 శాతం పతనమైంది. సుమారు రూ.50వేల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. బీఎస్ఈలో ఎక్సే్చంజీలో మొత్తం 19.12 లక్షల షేర్లు చేతుల మారాయి. రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందం రద్దుతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) షేరు నాలుగున్నర శాతం నష్టపోయి రూ.2,363 వద్ద స్థిరపడింది. ఒకదశలో ఐదు శాతం క్షీణించి రూ.2,351 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో ఆర్ఐఎల్ ఒక్కరోజులోనే రూ.69,364 కోట్ల సంపదను కోల్పోయింది. ► స్టాక్ మార్కెట్ భారీ పతనంలోనూ ఎయిర్టెల్ షేరు లాభపడింది. మొబైల్ ప్రీపెయిడ్ టారీఫ్‌లను 20–25 శాతం పెంచడం షేరు రాణించేందుకు కారణమైంది. ఇంట్రాడేలో ఆరుశాతం ఎగసి రూ.756 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో నాలుగు శాతం లాభంతో రూ.742 వద్ద ముగిసింది. ► హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి సుప్రీం కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అనుబంధ సంస్థ వేదాంత షేరు ఆరుశాతం లాభపడి రూ.328 వద్ద ముగిసింది. (చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది) పతనానికి కారణాలు... బలహీనంగా దేశీయ పరిణామాలు రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందం రద్దుతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) షేరు నాలుగున్నర శాతం నష్టపోయింది. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ కలిగిన ఆర్ఐఎల్ పతనం సూచీలకు భారీ నష్టాన్ని కలిగించింది. కేంద్రం వివాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. ఫలితంగా దేశీయ మార్కెట్ నుంచి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ మరింత పెరగవచ్చని ఆందోళనలు నెలకొన్నాయి. ఐపీఓ చరిత్రలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న పేటీఎం షేర్లు లిస్టింగ్‌లో నిరాశపరచడంతో పాటు తరువాత రోజు కూడా భారీ నష్టాల్ని చవిచూడటం మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇటీవల చాలా కంపెనీలు నిధుల సమీకరణకు ఐపీఓల బాటపట్టడంతో లిక్విడిటి సెకండరీ మార్కెట్ నుంచి ప్రాథమిక మార్కెట్‌కు తరలిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన మార్కెట్ ప్రతికూల సంకేతాలు అందాయి. చైనా అక్టోబర్ రిటైల్ అమ్మకాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా దేశాల్లో కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఆస్ట్రియా లాక్‌డౌన్‌ను విధించింది. మరికొన్ని దేశాలూ ఇదే యోచన చేస్తున్నాయి. ఫలితంగా యూకే, ఇటలీ, ఫ్రాన్ దేశాల స్టాక్ సూచీలు అరశాతం నష్టపోయాయి. ఇదే కోవిడ్ భయాలతోపాటు ద్రవ్యోల్బణ ఆందోళనలతో గతవారాంతంలో అమెరికా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. వడ్డీరేట్ల పెంపు భయాలు భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. ధరల కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు ముందుగానే కీలక రేట్లను పెంచవచ్చనే ఆందోళన పెరుగుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. (చదవండి: దేశంలో కోట్లలో సంపాదిస్తున్న టాప్-10 యూట్యూబర్స్ వీరే!) -
హౌసింగ్ మార్కెట్లో తగ్గిన నల్లధనం ప్రాబల్యం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత గడచిన ఐదేళ్లలో హౌసింగ్ మార్కెట్లో నల్లధనం (లేదా నగదు లావాదేవీలు) ప్రాబల్యం 75 నుంచి 80 శాతం తగ్గిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ– అనరాక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఏడు నగరాల్లోని డెవలపర్ల అభిప్రాయాల సేకరణ, బ్యాంకుల గృహ రుణ పంపిణీ గణాంకాలు, రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల సమీక్ష , 1,500కుపైగా సేల్స్ ఏజెంట్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు అనరాక్ పేర్కొంది. గృహ రుణ సగటు పరిమాణం మాత్రం గణనీయంగా పెరిగినట్లు తమ సర్వేలో తేలినట్లు అనరాక్ చైర్మన్ అనూజ్ పురి పేర్కొన్నారు. కాగా, చిన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆస్తి లావాదేవీల్లో నల్లధనం ఉందని గుర్తించినట్లు అనరాక్ చైర్మన్ వివరించారు. కారణాలు ఇవీ... పెద్ద నగరాల తొలి గృహ కొనుగోళ్లలో నల్లధనం హవా తగ్గడానికి కారణాలను అనూజ్ పురి వివరిస్తూ, బ్రాండెడ్, లిస్టెడ్ సంస్థలు ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయని, పూర్తి పారదర్శకతతో కూడిన అకౌంట్ల ద్వారానే మెజారిటీ గృహ కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, రెరా, జీఎస్టీ అమలు తర్వాత గృహ కొనుగోలుదారుల డిమాండ్ కూడా పారదర్శకతలో కూడిన బ్రాండెడ్ ప్రాజెక్టులకే ఉంటోందని తెలిపారు. ఇక ప్రధాన డెవలపర్లు లగ్జరీ ప్రాజెక్టులపైనే కేంద్రీకరించే తమ గత ధోరణిని మార్చుకుని, చౌక, మధ్య తరగతికి అనుగుణమైన హౌసింగ్ విభాగంపై దృష్టి సారించాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొత్తంగా హౌసింగ్ రంగంలో పారదర్శకత గణనీయంగా మెరుగుపడినట్లు వివరించారు. ‘దేశంలో గృహాల కొనుగోలు, విక్రయం అనే ప్రాథమిక అంశాలు, ధోరణుల్లో పెద్ద నోట్ల రద్దు గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. నేడు గృహ విక్రయాలు అధికభాగం వాస్తవ డిమాండ్ ప్రాతిపదికగానే జరుగుతున్నాయి. నల్లధనాన్ని చెలామణీలోకి తీసుకురావడానికి చేసే ఒక ప్రయత్నంగా ప్రస్తుతం రియల్టీ లేదు’’ అని పురి పేర్కొన్నారు. -
వెలవెలబోయిన ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రాపర్టీ షో నిరుత్సాహంగా మొదలైంది. ఇప్పటివరకు ట్రెడా 10 ప్రాపర్టీ షోలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఓ సినీ నటుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు. సాధారణం గా ఏ డెవలపర్ల సంఘం ప్రాప ర్టీ షో నిర్వహించినా నిర్మాణ రంగానికి సంబంధించిన మంత్రులనో లేదా ప్రభుత్వ అధికారులనో ముఖ్య అతిథిగా హాజరవటం ఆనవాయితీ. కానీ, ట్రెడా ఈ ఆనవాయితీని పాటించలేదు. సదరు నిర్వాహకులు ప్రభుత్వాధికారులు లేదా రాజకీయ నేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఎవరూ సరిగా స్పందించలేదని ట్రెడా సభ్యుడు ఒకరు తెలిపారు. నిర్మాణ సంస్థలు, బ్యాంక్‌లు కలిపి మొత్తం 105 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో 20–25 కంపెనీలు మినహా మిగిలిన స్టాల్స్ అన్నీ చిన్నా చితక నిర్మాణ సంస్థలకు చెందినవే. ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన స్టాల్సే. చాలా వరకు స్టాళ్లు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. ప్రతి ఏటా అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో ట్రెడా ప్రాపర్టీ షో నిర్వహించాలి కాబట్టి ఏదో మొక్కుబడిగా నిర్వహించినట్లు కనిపించింది. తొలి రోజు పైగా వర్కింగ్ డే కాబట్టి పెద్దగా సందర్శకులు రాలేదని.. శని, ఆది వారాలు సెలవు రోజులు కావటంతో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఓ స్టాల్ నిర్వాహకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో అనుమతులు లేని ప్రాజెక్ట్‌లు కూడా.. నిర్మాణ అనుమతులు రాని ప్రాజెక్ట్‌లు, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కరపత్రాలు, హోల్డింగ్స్ ప్రదర్శిస్తూ ట్రెడా ప్రాపర్టీ షోలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రెరా నిబంధనల ప్రకారం రెరా అనుమతి తీసుకోకుండా ప్రాజెక్ట్‌లను ప్రకటనలు చేయడం, ప్రదర్శించడం నేరం. కానీ నిర్వాహకులు ఇవేవి పట్టించుకోలేదు. పైగా ఆయా స్టాళ్ల వద్దకు వచ్చిన సందర్శకులతో ‘త్వరలోనే ప్రాజెక్ట్‌ను లాంచింగ్ చేయనున్నాం. ఇప్పుడే కొనుగోలు చేస్తే ధర తక్కువకు వస్తుందని ప్రీలాంచ్లో బుకింగ్ చేసుకోండని’ సదరు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్న ఓ కంపెనీ ఏకంగా స్పాన్సర్లలో ఒకటిగా నిలిచింది. సందర్శకులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా స్టాల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. -
మళ్లీ లాభాల్లోకి మార్కెట్
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 282 పాయింట్లు పెరిగి 43,882 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్లను ఆర్జించి 12,859 వద్ద నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి రికవరీ, ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం తదితర మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ కలిసొచ్చింది. చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 413 పాయింట్ల వరకు ఎగసి 44,013 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 12,892 – 12,771 రేంజ్లో కదలాడింది. మీడియా, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారంలో జరిగిన నాలుగు ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లను ఆర్జించాయి. శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3860.78 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రిలయన్స్ షేరుకు నాలుగో నష్టాలే... రిలయన్స్ షేరు వరుసగా నాలుగో రోజూ నష్టాలను చవిచూసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మేందుకే మొగ్గు చూపడంతో ఒక దశలో 4% నష్టపోయి రూ.1895 వద్ద రూ.1895 కనిష్టాన్ని తాకింది. చివరికి 3.50% క్షీణించి రూ.1899 వద్ద స్థిరపడింది. ఇండస్ టవ ర్స్, భారతీ ఇన్ఫ్రాటెల్ టవర్ల వ్యాపార విలీన ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రకటించడంతో ఎయిర్టెల్ షేర్లు 3% లాభంతో రూ.483.50 వద్ద ముగిసింది. గ్లాండ్ ఫార్మా లిస్టింగ్... గ్రాండ్! ముంబై: ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా స్టాక్ మార్కెట్ అరంగ్రేటం అదిరిపోయింది. ఇష్యూ ధర (రూ.1,500)తో పోలిస్తే బీఎస్ఈలో 13 శాతం లాభంతో రూ.1,701 వద్ద లిస్ట్య్యింది. కరోనా రాకతో ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజక్టబుల్ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు ఆçసక్తి చూపారు. ఒక దశలో 23 శాతం పెరిగి రూ.1,850 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరికి 21 లాభంతో రూ.1,820 వద్ద ముగిశాయి. హైదరాబాద్ ఆధారిత ఈ గ్లాండ్ ఫార్మా కంపెనీ రూ. 1,500 ధరతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ నెల 9న ప్రారంభమై 11న ముగిసిన ఐపీఓ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.6,480 కోట్లను సమీకరించింది. -
కరోనా 2.0 పంజా!
కొన్ని దేశాల్లో రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయంగా ఆర్థిక రికవరీ ఆశలకు గండి పడింది. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా సోమవారం భారీగా నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు తగ్గి 76.03కు చేరడం, మన దేశంలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడం... ప్రతికూల ్రçపభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 552 పాయింట్ల నష్టంతో 33,229 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 159 పాయింట్లు పతనమై 9,814 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6 శాతం మేర నష్టపోయాయి. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లోనూ ఈ సూచీలు పతనమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ పుంజుకోవడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. బ్యాంక్, ఆర్థిక, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇంధన, ఫార్మా రంగ షేర్లలో వేల్యూ బయింగ్ చోటుచేసుకుంది. రోజుకు లక్ష కరోనా కేసులు... కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాతో పాటు అమెరికాతో సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ప్రబలుతున్నాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కొత్త, పాత కరోనా కేసులు కలిపి రోజుకు లక్షకు పైగా తేలుతున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళన నెలకొంది. ఇక మన దగ్గర గత మూడు రోజులుగా రోజుకు 10,000 మేర కరోనా కేసులు వస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. రోజంతా నష్టాలు... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో సెన్సెక్స్ 857 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల మేర పతనమయ్యాయి. యూరప్ సూచీలు నష్టాల నుంచి ఒకింత రికవరీ కావడం, అమెరికా ఫ్యూచర్లు కూడా రికవరీ బాట పట్టడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ పుంజుకోవడంతో మన దగ్గర మధ్యాహ్నం తర్వాత నష్టాలు తగ్గాయి. ఆసియా మార్కెట్లు 1–5 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ 7 శాతం నష్టంతో రూ.490 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినా పలు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. లుపిన్, క్యాడిలా హెల్త్‌కేర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ, టెలికం కంపెనీల ఏజీఆర్ » కాయిల విషయమై సుప్రీంకోర్టులో విచారణలు ఈ వారంలోనే ఉండటంతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింది. మొండిబకాయిలకు సంబంధించి అనిశ్చితులు అధికంగా ఉండటంతో ప్రస్తుతానికైతే ఈ రంగ షేర్లకు దూరంగా ఉండమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ► సెన్సెక్స్ 30 షేర్లలో నాలుగు షేర్లు–రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్‌ఫార్మా, ఓఎన్జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. మళ్లీ 77 దిశగా రూపాయి? 76.03 వద్ద ముగింపు ∙ఆరు వారాల కనిష్టం డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ 77 దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 19 పైసలు పతనమై 76.03 వద్ద ముగిసింది. ఇది ఆరు వారాల కనిష్ట స్థాయి. విదేశీ నిధులు వెనక్కు వెళుతుండటం, బలహీన ఈక్విటీ మార్కెట్, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి అంశాలు దీనికి నేపథ్యం. గత శుక్రవారం రూపాయి ముగింపు 75.84. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 రెండవ దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలూ ఉన్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. ఆల్‌టైమ్ హైకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో రెండు దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేయడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై,రూ.1,627ను తాకింది. చివరకు 1.6 శాతం లాభంతో రూ.1,615 వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి 23న రూ.867కు పడిన ఈ షేర్ మూడు నెలల్లోనే 80 శాతానికి పైగా ఎగియడం విశేషం. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ పాక్షిక చెల్లింపు షేర్లు(పార్ట్లీ పెయిడప్ షేర్స్) మదింపు ధర రూ.646తో పోల్చితే 8 శాతం లాభంతో రూ.698 వద్ద ముగిశాయి. -
మొండి బండ.. మరింత భారం!
మొండి బకాయిలు... ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమస్య తీవ్రత తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ సమస్య కారణంగానే గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నిర్వహణ నష్టాలు రూ.50,000 కోట్లకు మించాయి. అంతే కాకుండా భారీ కంపెనీల కొన్ని బకాయిలు మొండిగా మారే ప్రమాదమూ పొంచి ఉంది. మార్చి క్వార్టర్ చివరినాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల స్థూల మొండి బకాయిలు రూ.7.7 లక్షల కోట్లకు తగ్గింది. అయితే ఇది ఏమంత ఊరటనిచ్చే విషయం కాదని నిపుణులంటున్నారు. దివాలా ప్రక్రియ మంచిదే కానీ... మొండి బకాయిల రికవరీ కోసం రూపొందించిన దివాలా చట్టం మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియ కారణంగా బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే తక్కువ మొత్తంలోనే రికవరీ కానుండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించనున్నది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోవడం కూడా బ్యాంక్‌లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి, 5.8 శాతానికి పడిపోయింది. జీడీపీ క్షీణత కారణంగా వ్యవసాయ, రియల్టీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలకు ఇచ్చిన రుణాలు మొండిగా మారిపోయే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఒత్తిడి ఖాతాల కోసం మూలధన నిధులను కేటాయిస్తున్నాయి. భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ అండ్ మోనెట్ ఇస్పాత్, జెట్ ఎయిర్వేస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, కొన్ని ఎన్బీఎఫ్సీ కంపెనీలు...ఇలా ఒత్తిడి ఖాతాలకు నిధులను కేటాయిస్తున్నాయి. ఇది ఆందోళనకరం. ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్‌లకు సంబంధించిన దివాలా కేసులు పూర్తిగా పరిష్కారమైతే, బ్యాంక్‌లకు మొండి బకాయిల భారం ఒకింత తీరుతుంది. ఈ కేసులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం కల్లా పరిష్కారం అవుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు... గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.52,000 కోట్ల మేర నిధులందించింది. దీంతో కలుపుకొని మొత్తం రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు అందించినట్లయింది. ఈ నిధుల్లో అధిక మొత్తాలను బ్యాంక్‌లు మొండిబకాయిల ‘కేటాయింపులకే’ కేటాయించాయి. అయినప్పటికీ, గత క్యూ4లో బ్యాంక్‌ల నష్టాలు తగ్గలేదు. రుణ నాణ్యత తగ్గడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రుణ మంజూరీలు కూడా తగ్గాయి. ప్రైవేట్ బ్యాంక్‌లు జోరుగా రుణాలిస్తుండగా, ప్రభుత్వ బ్యాంక్‌లు మాత్రం రుణ నాణ్యతను మెరుగుపరచుకోవడంపైననే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు చూస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ–డిపాజిట్ నిష్పత్తి 2017లో 64 శాతం, గతేడాది 72 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంక్ రుణ–డిపాజిట్ నిష్పత్తి 95, 91 శాతాలుగా నమోదైంది. కంపెనీలకు తగ్గుతున్న రుణాలు.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.., ఇతర రుణాలతో పోల్చితే కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో తగ్గాయి. కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు 12 శాతం తగ్గాయి. మరోవైపు వాహన కొనుగోళ్ల రుణాలు 5 శాతం, ఇతర వ్యక్తిగత రుణాలు 21 శాతం, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల రుణాలు 1 శాతం మేర పెరిగాయి. మధ్య స్థాయి సంస్థలకు ఇచ్చిన రుణాలు 4 శాతం ఎగిశాయి. మెరుగుపడుతున్న రుణ నాణ్యత ఇక రుణ నాణ్యత మెరుగుదల అన్ని బ్యాంక్‌ల్లో ఒకేలా లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) స్థూల మొండి బకాయిలు 23 శాతం తగ్గి రూ.1.73 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. తాజా మొండి బకాయిలపై నియంత్రణ సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార వ్యాఖ్యానించారు. రుణ నాణ్యత మరింతగా మెరుగుపడిందని, ఒత్తిడి ఖాతాలకు తగిన కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. దాదాపు ఏడు క్వార్టర్ల పాటు నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత క్యూ4లో లాభాల బాట పట్టింది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 27 శాతం తగ్గి రూ.12,053 కోట్లకు తగ్గాయి. రుణ నాణ్యత మెరుగుదల పరంగా చూస్తే, ప్రభుత్వ బ్యాంక్‌ల కంటే ప్రైవేట్ బ్యాంక్‌లదే పై చేయిగా ఉంది. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ముందు వరుసలో ఉంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 14 శాతం తగ్గి రూ.46,292 కోట్లకు చేరాయి. ప్రైవేట్ బ్యాంక్‌లకూ పాకుతున్న సమస్య... మొండి బకాయిల విషయంలో కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోటీ పడుతున్నాయి. స్థూల మొండి బకాయిల పెరుగుదల విషయంలో యస్‌బ్యాంక్‌ను చెప్పుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 200 శాతం ఎగసి రూ.7,883 కోట్లకు పెరిగాయి. ఒక విమానయాన సంస్థ(జెట్ ఎయిర్వేస్ కావచ్చు), మౌలిక రంగ దిగ్గజం(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించామని, అందుకే గత క్యూ4లో మొండి బకాయిలు భారీగా పెరిగాయని యస్ బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 131 శాతం పెరిగి రూ.3,947 కోట్లకు చేరాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించడం వల్ల ఈ బ్యాంక్ మొండిబకాయిలు ఇంతగా పెరిగాయి. ఈ బ్యాంక్‌కు మొండి భారం మరింతగా ఉండనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు, ఎస్సెల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఇతర కొన్ని కంపెనీలకు బాగానే రుణాలిచ్చిందని, ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వీటి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లను మొండి బకాయిల సమస్య ఇప్పట్లో వదిలేలా లేదు. -
ప్రపంచ పరిణామాలు కీలకం..!
న్యూఢిల్లీ: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ షట్‌డౌన్ వంటి ప్రతికూల పరిణామాలు గతవారంలో అంతర్జాతీయ మార్కెట్లను కుంగదీశాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ గతవారంలో 1,655 పాయింట్లు (6.8 శాతం) పతనంకాగా, నాస్డాక్ 8.3 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీ సూచీలు సైతం భారీ పతనాన్ని నమోదుచేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 10,754 వద్ద ముగిసింది. 10,800 మార్కును కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈవారం ప్రధాన సూచీలు ఏ దిశగా ప్రయాణం చేస్తాయనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించడం.. అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెల్లడికాకుండానే కాంగ్రెస్ వాయి దా పడడం వంటి ప్రతికూలతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే విధంగా ఉన్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. వృద్ధి రేటు మందగించవచ్చని కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్యలు, ట్రంప్‌కు కాంగ్రెస్‌కు మధ్య కొనసాగుతున్న విభేదాలు, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడం వంటి ప్రతికూలతలు ఈవారంలో ప్రభావం చూపనున్నట్లు భావిస్తున్నారు. ఇక గురువారం వెల్లడికానున్న నవంబర్ నెల గృహ నిర్మాణ, అమ్మకాల సమాచారం మరో కీలక అంశంగా ఉందని చెబుతున్నారు. కాగా, 25న(మంగళవారం) క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. సానుకూలంగా దేశీ పరిణామాలు అంతర్జాతీయ పరిణామాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా మాత్రం సానుకూల అంశాలు కొనసాగుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ముడిచమురు ధరలు గతవారం 11 శాతం పతనం కావడం వల్ల కరెంట్ ఖాతా లోటు భారాన్ని తగ్గిస్తుంది. పారిశ్రామికోత్పత్తి ఊపందుకుంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా ఉండేందుకు సహకరిస్తోంది. ఈ పరిణామాలతో ఆర్బీఐ సైతం కఠిన వైఖరి నుంచి తటస్థ వైఖరికి మారింది. ఈ అంశాలు సూచీలకు సానుకూలంగా ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ కానుక కింద మధ్య తరగతి ప్రజలు వినియోగించే 23 వస్తు, సేవలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించడం మరో పాజిటివ్ అంశమన్నారాయన. అయితే, మరోవైపు డిసెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ గురువారం ముగియనున్న కారణంగా అధిక ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 10,550 వద్ద కీలక మద్దతు.. ఈవారంలో నిఫ్టీకి 10,550 పాయింట్ల వద్ద కీలక మద్దతు స్థాయి ఉందని ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ విశ్లేషకులు వైశాలి పరేఖ్ అన్నారు. ఈసూచీ కీలక నిరోధం 10,930 పాయింట్ల వద్ద ఉందని విశ్లేషించారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.4,000 కోట్లు డిసెంబర్ 3–21 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.3,884 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,332 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.2,552 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు డేటా ద్వారా వెల్లడైంది. ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే, ఏడాది చివర్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రేపట్నుంచి వర్షాలు తగ్గుముఖం
హైదరాబాద్: అకాల వర్షాలతో అపార నష్టాన్ని కలిగిస్తున్న వరణుడి ప్రభావం శనివారం నుంచి ఉండదని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అప్ప పీడన ద్రోణి ఉంటుందని తెలిపారు. గురువారం కూడా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వాటి వివరాలను చూసినట్లయితే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొమరాడలో 4 సెంటీ మీటర్లు, విశాఖపట్టణం జిల్లా మాడుగుల, ప్రకాశం జిల్లా పొదిలి, గుంటూరు జిల్లా మాచర్లలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా రాయలసీమలోని అనంతపురం జిల్లా మడకశిర లో 8, గుమ్మఘట్టలో 7, గుత్తి, రాయదుర్గం, గంగవరం లలో 4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే.. ఏటూరు నాగారం, గోవిందరావుపేటలో 7, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఖమ్మం జిల్లా ఇల్లెందు, వెంకటాపురంలలో 6, కొత్తగూడెం, గుండాలలో 5 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది.