Anil Ambani: దెబ్బ మీద దెబ్బ.. పట్టిందల్లా పతనం! | Anil Ambani downfalls in business career | Sakshi
Sakshi News home page

Anil Ambani: దెబ్బ మీద దెబ్బ.. పట్టిందల్లా పతనం!

Published Sat, Aug 24 2024 2:28 PM | Last Updated on

Anil Ambani downfalls in business career1
1/7

అనిల్ అంబానీ తన వ్యాపార జీవితంలో అనేక వైఫల్యాలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు. దెబ్బ మీద దెబ్బ, పట్టిందల్లా పతనం అన్న రీతిలో ఆయనను దురదృష్టం వెంటాడుతోంది.

Anil Ambani downfalls in business career2
2/7

టెలికాం పరిశ్రమలో ఒకప్పుడు ప్రధాన సంస్థగా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. పెరుగుతున్న అప్పులు, తీవ్రమైన పోటీ కారణంగా 2019లో దివాలా కోసం దాఖలు చేసింది.

Anil Ambani downfalls in business career3
3/7

2008లో రిలయన్స్ పవర్ ఐపీఓకి వచ్చినప్పుడు చాలా హైప్ వచ్చి విజయవంతమైంది. అయితే స్టాక్ ధర క్షీణించడంతో విమర్శలను ఎదుర్కొంది. పెట్టుబడిదారులకు గణనీయమైన నష్టాలను మిగిల్చింది.

Anil Ambani downfalls in business career4
4/7

గతంలో పిపావావ్ డిఫెన్స్ అని పిలిచే రిలయన్స్ నావల్ అండ్‌ ఇంజనీరింగ్ కంపెనీ భారీ రుణాలు, కార్యాచరణ సవాళ్లతో పోరాడింది. చివరికి దివాలా తీసింది.

Anil Ambani downfalls in business career5
5/7

2015 నాటికి అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) అప్పులు రూ.1,25,000 కోట్లకు చేరాయి. సేకరించింది, ఇది ఆయన కంపెనీల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా ప్రభావితం చేసింది.

Anil Ambani downfalls in business career6
6/7

రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన రూ.8,000 కోట్ల మధ్యవర్తిత్వ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇది అనిల్‌ అంబానీ ఆర్థిక కష్టాలను మరింత దిగజార్చింది.

Anil Ambani downfalls in business career7
7/7

తాజాగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో నిధుల మళ్లింపు కారణంతో సెక్యూరిటీస్‌ మార్కెట్ నుంచి సెబీ ఐదేళ్లపాటు నిషేధించింది.

Advertisement
 
Advertisement
Advertisement