
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా తలపడుతున్న కాంగ్రెస్..తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు ఆఖరి పోరాటం చేస్తోంది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాం«దీ, మల్లికార్జున ఖర్గేలు ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమవారం సైతం వీరు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
నిజానికి 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో కనీస ఖాతా తెరవాలని గట్టి పట్టుదలతో ఉంది. 2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమయింది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలువలేదు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 18శాతం ఓట్ల మేర సాధించింది. ఈసారి దాన్ని కాస్త పెంచుకున్నా 5 నుంచి 10 స్థానాలు గెలువచ్చనే అంచనాల్లో ఉంది. అయితే ఆప్‌తో పొత్తు లేకపోవడం, ప్రధాన పోటీ మొత్తంగా బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఢిల్లీని పట్టి పీడిస్తున్న యమునా నది కాలుష్య అంశాన్ని రాజకీయ అస్త్రంగా మాలుచుకునేందుకు రాహుల్‌గాంధీ స్వయంగా కాలుష్య నురగలు కక్కుతున్న యమునాలో బోటులో పర్యటించగా, అది ఏమేరకు ప్రభావితం చేస్తుందన్నది ప్రశ్నగానే ఉంది.
ఇక ఢిల్లీని ప్రధాని మోదీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొత్తంగా నాశనం చేశారని, లిక్కర్ మాఫియాలో ప్రభుత్వ పెద్దలంతా కూరుకుపోయిరని, శీష్ మహల్‌లో విలాసవంతమైన జీవితాన్ని కేజ్రీవాల్ గడిపారంటూ ఎక్కుపెట్టిన అ్రస్తాలు ఎంతవరకు ఓటర్లను తాకాయన్నది తేలాలి. మేనిఫెస్టో హామీలనే ప్రధానాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పింఛను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంపు, సోమవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో తెలంగాణ, పంజాబ్, హరియాణా నేతలనూ ప్రచారంలోకి దించింది.
Comments
Please login to add a commentAdd a comment