final fight
-
కాంగ్రెస్ ఆఖరి పోరాటం..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా తలపడుతున్న కాంగ్రెస్..తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు ఆఖరి పోరాటం చేస్తోంది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాం«దీ, మల్లికార్జున ఖర్గేలు ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమవారం సైతం వీరు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. నిజానికి 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో కనీస ఖాతా తెరవాలని గట్టి పట్టుదలతో ఉంది. 2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమయింది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలువలేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 18శాతం ఓట్ల మేర సాధించింది. ఈసారి దాన్ని కాస్త పెంచుకున్నా 5 నుంచి 10 స్థానాలు గెలువచ్చనే అంచనాల్లో ఉంది. అయితే ఆప్‌తో పొత్తు లేకపోవడం, ప్రధాన పోటీ మొత్తంగా బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఢిల్లీని పట్టి పీడిస్తున్న యమునా నది కాలుష్య అంశాన్ని రాజకీయ అస్త్రంగా మాలుచుకునేందుకు రాహుల్‌గాంధీ స్వయంగా కాలుష్య నురగలు కక్కుతున్న యమునాలో బోటులో పర్యటించగా, అది ఏమేరకు ప్రభావితం చేస్తుందన్నది ప్రశ్నగానే ఉంది. ఇక ఢిల్లీని ప్రధాని మోదీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొత్తంగా నాశనం చేశారని, లిక్కర్ మాఫియాలో ప్రభుత్వ పెద్దలంతా కూరుకుపోయిరని, శీష్ మహల్లో విలాసవంతమైన జీవితాన్ని కేజ్రీవాల్ గడిపారంటూ ఎక్కుపెట్టిన అ్రస్తాలు ఎంతవరకు ఓటర్లను తాకాయన్నది తేలాలి. మేనిఫెస్టో హామీలనే ప్రధానాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పింఛను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంపు, సోమవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో తెలంగాణ, పంజాబ్, హరియాణా నేతలనూ ప్రచారంలోకి దించింది. -
ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడి
లక్నో: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ సీజన్లో తొలి టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. సయ్యద్ మోదీ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సింధు శనివారం జరిగిన సెమీఫైనల్లో తొలి గేమ్‌ను 21–11తో అలవోకగా గెలిచింది. ఈ దశలో ఆమె ప్రత్యర్థి ఎవ్‌గెనియా కొసెత్సకయా (రష్యా) రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ మధ్యలో తప్పుకుంది. దీంతో 14 నిమిషాల్లోనే సింధు సెమీఫైనల్ గెలిచి తుది పోరుకు అర్హత సాధించినట్లయింది. సింధు నేడు జరిగే టైటిల్ పోరులో భారత్‌కే చెందిన మాల్విక బన్సోద్తో తలపడనుంది. సెమీఫైనల్లో మాల్విక 19–21, 21–19, 21–7తో అనుపమా ఉపాధ్యాయపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ షట్లర్ అర్నాడ్ మెర్కెలె 21–19, 17–21, 21–9తో మిథున్ మంజునాథ్ పై గెలుపొందాడు. మరో సెమీస్‌లో లుకాస్ క్లేర్బొట్ (ఫ్రాన్స్) 15–21, 21–18, 21–15తో నాట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)ను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ తుది పోరుకు అర్హత సంపాదించింది. సెమీఫైనల్లో గాయత్రి జంట 17–21, 21–8, 21–16తో మలేసియాకు చెందిన లో యిన్ యువాన్–వాలెరీ స్లొవ్ ద్వయంపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–10, 21–9తో ప్రేమ్‌సింగ్ చౌహాన్–రాజేశ్ వర్మ జంటపై గెలిచి ఫైనల్ చేరింది. -
ఇదే ఆఖరి పోరాటం
26న పాదయాత్ర జరిగి తీరుతుంది ఇంటికొకరు కదలిరండి చావో...రేవో తేల్చుకుందాం కాపు ఉద్యమనేత ముద్రగడ పిలుపు పిఠాపురం టౌన్: ఇంటికొచ్చి నిద్రలేపి కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగితే అణిచివేసే కార్యక్రమాలు చేపడతున్నారని, అవమానాలకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కల్యాణ మంటపంలో కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీకి రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం చేపట్టి సరిగ్గా రెండేళ్లు కావస్తుందని, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సీఎంకు చీమకుట్టనట్టు నటిస్తున్నారన్నారు. ఈ నెల 26న పాదయాత్ర జరిగి తీరుతుందని ఇదే ఆఖరి పోరాటం, ఆకలి పోరాటం అని ఆయన అన్నారు. కాపులు, బిసీలు, దళితుల మధ్య తగాదాలు సృష్టించి రాజకీయంగా ఎదగాలని చంద్రబాబు చూస్తున్నారని ఈ కుట్ర అందరికీ తెలుసన్నారు. ఎన్నికల్లో ఎంతో మంది కాపులు ఓట్లు వేసి చంద్రబాబును గెలిపిస్తే ఇప్పుడు కాలుతో తన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు మీద పడుతున్నా...చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యామన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న కాపు సోదరులను కూడా కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో మన రక్షణ కోసం ఇంటికొకర్ని పంపిస్తున్నారని, అదేవిధంగా కాపు ఉద్యమం కోసం ఇంటికొకర్ని పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాపుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను, క్రీడాకారులను ముద్రగడ చేతులు మీదుగా ఘనంగా సత్కరించారు. రాష్ట్ర కాపు ఐక్యవేదిక సభ్యుడు గుండా వెంకటరమణ, ఆదర్ష్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంటు బుర్రి అనుబాబు తదితరులు పాల్గొన్నారు.