న్యూఢిల్లీ: దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు జల కాలుష్యం కూడా తీవ్ర స్థాయికి చేరింది. పరిశ్రమల నుంచి విడుదలయిన వ్యర్థాలు యమునా నదిలో కలిసి.. దాన్ని గరళంగా మార్చేశాయి. నది పైన తెల్లని నురగ ఏర్పడింది.
ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో జనాలు నదీ స్నానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో పలువురు ఢిల్లీ మహిళలు కాలుష్య కాసారంగా మారిన యమునా నదిలో స్నానాలు ఆచరించారు. రసాయనాలతో కలుషితమై నురగలు కక్కుతున్నప్పటికి జనాలు.. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్నానాలు చేశారు. సడెన్‌గా చూస్తే.. ఇదేదో సినిమా సెట్టింగో లేక స్పెషల్ ఎఫెక్ట్‌లానే అనిపిస్తుంది.
(చదవండి: ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం)
ఇక ప్రతి ఏటా శీతాకాలంలో ఢిల్లీలో వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది. పొగ ఆవరించి.. ఎదురుగా వచ్చే వారిని గుర్తించడం కష్టం అవుతుంది. దానికి తోడు వాయు కాలుష్యం కూడా చేరి.. పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇక గత మూడు రోజులుగా ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. తీవ్రమైన వాయు కాలుష్యంగా కారణంగా జనాలు గొంతులో మంట, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.
చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి..
Comments
Please login to add a commentAdd a comment