
న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ పెద్ద సాహసమే చేశారు. కాలుష్య కాసారంగా మారి విషపు నురగలు కక్కుతున్న యమునా నదిలో సచ్‌దేవ మునిగారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్‌దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్ పడింది.
చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్‌దేవను శనివారం(అక్టోబర్ 26) ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు బీజేపీ పార్టీ సోషల్‌మీడియా వెల్లడించింది. యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాలే కారణమని బీజేపీ విమర్శించింది.
కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్ ప్రభుత్వం దారి మళ్లించిందని నిరసన తెలపడంలో భాగంగా సచ్‌దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్‌దేవ యమునలో మునగడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.
ఇదీ చదవండి: అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే
Comments
Please login to add a commentAdd a comment