dip
-
యమునలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్.. ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ పెద్ద సాహసమే చేశారు. కాలుష్య కాసారంగా మారి విషపు నురగలు కక్కుతున్న యమునా నదిలో సచ్దేవ మునిగారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్‌దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్ పడింది.చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్‌దేవను శనివారం(అక్టోబర్ 26) ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు బీజేపీ పార్టీ సోషల్‌మీడియా వెల్లడించింది. యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాలే కారణమని బీజేపీ విమర్శించింది. కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్ ప్రభుత్వం దారి మళ్లించిందని నిరసన తెలపడంలో భాగంగా సచ్దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్దేవ యమునలో మునగడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.ఇదీ చదవండి: అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే -
వివాహేతర సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి కుమారుడ్ని దారుణంగా
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడ్ని దారణంగా హత్య చేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా వేడి వేడి నీళ్లున్న బకెట్లో బాలుడ్ని ముంచాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయాడు. నిందితుడి పేరు విక్రమ్ శరద్ కోలేకర్. ఖేడ్‌లో నివసిస్తున్నాడు. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళతో చాలా కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా ఖేడ్లోనే ఉంటోంది. అయితే ఏప్రిల్ 6న ఉదయం మహిళ ఇంటికెళ్లాడు విక్రమ్. పిల్లాడిని ఇతనికి అప్పగించి ఆమె బయటకు వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిని వేడి నీటిలో ముంచాడు. ఇంటికొచ్చి చూసిన తల్లి కాలిన గాయాలున్న కుమారుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. 15 రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. విక్రమ్ తనను పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా అడుగుతున్నాడని, అందుకు తాను ఒప్పుకోలేదనే కోపంతోనే తన కుమారుడ్ని చంపాడని మహిళ ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై కేసు పెట్టింది. దీంతో విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. చదవండి: అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు? -
ఊరట: దిగొస్తున్న పుత్తడి ధరలు
సాక్షి, ముంబై: నిన్నమొన్నటి దాకా చుక్కల్ని తాకిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అన్‌సీజన్, ద్రవ్యోల్బణ ఆందోళనలు, డాలర్ బలం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ పుత్తడి గరిష్టాలనుంచి వెనక్కి తగ్గుతోంది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గి ధర 47,340 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల కూడా రూ.10 క్షీణించి రూ. 43,390కు చేరుకుంది. దేశీయ ఫ్యూచర్మార్కెట్లో పసిడి పదిగ్రాములకు28 రూపాయలు క్షీణించి 46213 వద్ద ఉండగా, 500 రూపాయలు పడిన వెండి 68700 స్థాయికి చేరింది. బంగారం ధరలు 8 నెలల కనిష్టానికి సమీపానికి చేరువలో ఉండటంతోపాటు, రికార్డు స్థాయినుంచి 10 వేల రూపాయలు దిగి వచ్చినట్టయింది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి ధర 46,750 స్థాయికిచేరింది. వెండి ధర సిల్వర్ ధర కిలోకు రూ .70,200 స్థాయికి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 45,550 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో 450 రూపాయలు తగ్గి 43,720 రూపాయలకు పడిపోయింది. అటు యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి 1,767.60 డాలర్లకు చేరుకుంది. యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఏడాది గరిష్టానికి చేరడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోందని డైలీఎఫ్ఎక్స్ వ్యూహకర్త మార్గరెట్ యాంగ్ వ్యాఖ్యానించారు. మెరుగైన ఆర్థిక సెంటిమెంట్ ,ద్రవ్యోల్బణ ఆందోళనలు యూఎస్ బాండ్ ఈల్డ్స్ గరిష్టానికి చేరాయనీ, ఇది బంగారంలో అమ్మకాలకు దారితీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ కమోడిటీస్ హరీష్ వీ అన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల భారీ పతనంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారిన సెన్సెక్స్ ఏకంగా 1540 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. దాదాపు అన్ని రంగాలు భారీగా నష్టపోతున్నాయి. -
మరోసారి మారుతి అమ్మకాలు ఢమాల్!
సాక్షి,ముంబై: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) అమ్మకాల్లో ఈ నెలలో కూడా కుదేలైంది. తాజా గణాంకాల ప్రకారం అమ్మకాలలో 24.4 శాతం క్షీణించింది. సెప్టెంబర్‌లో 1,22,640 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ 1,62,290 యూనిట్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఎగుమతులు కూడా క్షీణించాయని ఎంఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో దేశీయ అమ్మకాలు 26.7 శాతం క్షీణించి 1,12,500 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది (2018, సెప్టెంబర్‌లో) 1,53,550 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, వాగన్ఆర్లతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 20,085 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 34,971 యూనిట్లు, 42.6 శాతం తగ్గాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ అమ్మకాలు, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో మరియు డిజైర్ వంటి మోడల్స్ 22.7 శాతం క్షీణించి 57,179 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 74,011 కార్లు ఉన్నాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అంతకుముందు 6,246 యూనిట్లతో పోలిస్తే 1,715 యూనిట్లను విక్రయించింది. అదేవిధంగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 21,526 యూనిట్ల వద్ద స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇవి 21,639 గా ఉంది. సెప్టెంబరులో ఎగుమతులు 17.8 శాతం తగ్గి 7,188 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 8,740 యూనిట్లు నమోదయ్యాయి. దీంతో పండుగ సీజన్లో నేపథ్యంలో ఆగస్టు మాసంతో పోలిస్తే సెప్టెంబరులో విక్రయాలు పెరుగుతాయనే ఆటో కంపెనీల ఆశలపై తాజా లెక్కలు నీళ్లు చల్లాయి. -
నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను మంత్రి కె.తారకరామారావు కోరారు. జాతీయ ఆరోగ్య భద్రతకు దోహదపడే ఈ ప్రాజెక్టు తెలంగాణతోపాటు యావత్ దేశానికి ఉపయోగపడుతుందని వివరించారు. గురువారం కేంద్ర మంత్రిని పార్లమెంటులో కలుసుకున్న కేటీఆర్.. నిమ్జ్ లక్ష్యాలను వివరించారు. ప్రాణాంతక వ్యాధుల నివారణకు అవసరమైన యాంటిబయోటిక్స్‌ను 84 శాతం వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వ్యాధి నిరోధక మందుల కోసం భారీ స్థాయిలో ఇతర దేశాలపై ఆధారపడటం దేశానికి తీవ్రమైన సమస్య అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ ఫార్మా రంగానికి ఉత్తమిచ్చేలా నిమ్జ్‌ను ఏర్పాటు చేయనున్నామని, దీని ఏర్పాటుకు అవసరమైన ఈఐఏ నివేదికను ఇటీవల కేంద్రానికి పంపామని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్, ఎఫ్ఐసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరగనున్న మైనింగ్ టుడే–2018 సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని హర్షవర్ధన్, మరో మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌లను కేటీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ‘డీఐపీ’ఏర్పాటు చేయండి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (డీఐపీ) కారిడార్లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. రక్షణ రంగంతో హైదరాబాద్‌కు అనుబంధం ఉందని.. రక్షణ రంగ సంస్థలు, పరికరాల తయారీలో ముందు వరుసలో ఉందని వివరించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ రాత్రి సమావేశమైన కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. - ఢిల్లీలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన కేటీఆర్ -
18శాతం ఢమాలన్న గృహ విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త నిబంధనలతో రూపొందించిన చట్టం రెరా కారణంగా గృహాల విక్రయాలు భారీగా పడిపోయాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. దేశంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ మార్కెట్లో డిమాండ్ వరుసగా మందగిస్తోందనీ, సెప్టెంబర్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్ ఇది 18శాతం క్షీణించిందని రిపోర్ట్‌లో తేలింది. హైదరాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం కనిపించింది. రియల్టీ పోర్టల్ ప్రాప్ టైగర్ . కాం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడయ్యాయి. డీమానిటైజేషన్, రియల్ ఎస్టేట్ కొత్త చట్టం రెరా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్లో దాదాపు 53 శాతం క్షీణించి, 22, 115 యూనిట్లకు పడిపోయిందని పేర్కొంది. ముఖ్యంగా పుణే, నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తా, అహ్మదాబాద్‌లో గృహ అమ్మకాలు, అలాగే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ భారీగా పడిపోయిందని నివేదించింది. కేవలం ముంబై, గుర్గావ్లో మాత్రం డిమాండ్ అండ్ సప్లయ్‌లో పురోగతి కనిపించిందని వ్యాఖ్యానించింది. నోట్ల రద్దు, కొత్త రెరా, జీఎస్టీ కారణంగా 2018 ఆర్థిక సంవతసరంలో రెండవ త్రైమాసికంలో లాంచింగ్, అలాగే అమ్మకాలు ప్రభావితం చేశాయని ప్రాప్ టైగర్ . కాం చీఫ్ ఇన్వెస్ట్మెంటట్ ఆఫీసర్ అంకుర్ ధావన్ చెప్పారు. అయితే జూలై, ఆగస్టు నెలలతో పోలిస్తే, ఫెస్టివ్ పీజన్లో అమ్మకాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. జులై-సెప్టెంబర్ క్వార్టర్లో అహ్మదాబాద్‌లో 46 శాతం భారీ క్షీణతను నమోదుచేసి 2,222 యూనిట్లు విక్రయించింది. బెంగళూరులో 27 శాతం తగ్గి, 6,976 యూనిట్లు, చెన్నై 23 శాతం నీరసపడి 2,945 యూనిట్లు, కోల్ కతాతా 21 శాతం అమ్మకాలు క్షీణించి 2,993 యూనిట్లు, హైదరాబాద్ 18 శాతం తగ్గి 3,356 యూనిట్లను విక్రయాలు జరిగినట్టు తెలిపింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అమ్మకాలు గుర్గావ్ లో 60 శాతం వృద్ధితో 3,342 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబైలో 6 శాతం పెరిగి 12,101 యూనిట్లకు చేరుకున్నాయి. -
స్విస్ బ్యాంకులో మన డిపాజిట్లు ఎందుకు తగ్గాయి?
న్యూఢిల్లీ: దేశంలో నల్లడబ్బును అరికట్టేందుకు వివిధ చర్యలు తీసుకోవడంతోపాటు విదేశాల్లో దాస్తున్న నల్లడబ్బును కూడా నియంత్రించేందుకు ఆయా దేశాలతో పాత చట్టాలను బలోపేతం చేసుకోవడం, కొత్త చట్టాలను తీసుకురావడం మంచి ఫలితాలనిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక జీఎస్టీ ప్రారంభోత్సవం రోజున (జూలై 1న) చెప్పారు. స్విస్ బ్యాంక్‌లో 2016 సంవత్సరానికి భారతీయుల డిపాజిట్లు అంతకుముందు సంవత్సరం కన్నా సగానికి సగం పడిపోవడమే అందుకు ఉదాహరణగా చూపారు. 2015 సంవత్సరంలో స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 8,135 కోట్ల రూపాయలు ఉండగా, 2016, జూన్ నాటికి 4,482 కోట్ల రూపాయలకు పడిపోయాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే స్విస్ బ్యాంక్‌లో మన భారతీయుల డిపాజిట్లు తగ్గాయా? ఏ ఏడాది నుంచి డిపాజిట్లు తగ్గుతున్నాయి? దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమైనా ఉందా? తగ్గటానికి ఇతరత్రా కారణాలు ఇంకేవైనా ఉన్నాయా? స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన భారతీయ డిపాజిట్లు 2016 జూన్ నెల నాటివి. అదే సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసినందున వాటి ప్రభావం ఉండే అవకాశమే లేదు. ఇక స్విట్జర్లాండ్ ఆటోమేటిక్‌గా ప్రతి ఏటా భారత ప్రభుత్వానికి స్విస్ ఖాతాల్లో భారతీయుల డిపాజిట్ల వివరాలను అందుజేసేందుకు ఆ ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వానికి 2016, నవంబర్ 22న ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2018, సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది. పైగా ఈ ఒప్పందంలో పెద్ద మెలిక ఉంది. 2018, సెప్టెంబర్ నెలకు ముందున్న బ్యాంకు డిపాజిట్ వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదు. 2018, సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే, అది అప్పటికున్న అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయుల బ్యాంకు లావాదేవీల వివరాలను అందజేస్తుంది. అంటే మొదటిసారిగా ఖాతా వివరాలు 2019, సెప్టెంబర్ నెలలో మాత్రమే భారత్‌కు అందుతాయి. డిపాజిట్‌దారుల పేర్లను ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయమన్న షరతుతోనే స్విస్ ఈ ఒప్పందానికి అంగీకరించింది. పైగా ఇలాంటి ఒప్పందం స్విట్జర్లాండ్‌తో ఒక్క భారత్ దేశమే కాదు. మొత్తం 40 దేశాలు చేసుకున్నాయి. 2016, జూన్ నాటికి స్విస్ ఖాతాల్లో భారతీయుల డిపాజిట్లు 4,482 రూపాయలకు పడిపోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి చర్యలకు సంబంధం లేదు. మరి డిపాజిట్లు ఎందుకు పడిపోతున్నాయి. గతంలో 2012లో ఒక్కసారి పడిపోగా ఆ తర్వాత 2014, 2015, 2016 సంవత్సరాల్లో వరుసగా భారతీయుల డిపాజిట్లు పడిపోతూ వస్తున్నాయి. పన్నుకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో పారదర్శకతను కోరుకునే అంతర్జాతీయ సంస్థ ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్’ 2014లోనే స్విస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొంది. ఈ ఒప్పందంపై భారత్ సహా 50 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ 50 దేశాలకు చెందిన ఖాతాదారుల లావాదేవీల వివరాలను స్విస్ బ్యాంక్ ఆయా దేశాలకు అందజేయాల్సి ఉంటుందని ఆ సంస్థ హెడ్ మోనికా భాటియా తెలిపారు. ఆ ఒప్పందం ప్రభావం వల్లనే భారతీయుల డిపాజిట్లు సగానికి సగం తగ్గి ఉంటాయని ఆర్థిక నిపుణుల భావిస్తున్నారు. -
అటు అక్షయ తృతీయ, ఇటు దిగివస్తున్న పుత్తడి
ముంబై:ముంబై: ఒకవైపు అక్షయ తృతీయ( ఏప్రిల్ 28) సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగి రావడం శుభసూచికంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ ఎన్నికల తొలిరౌండ్ ఫలితాల్లో యూరో అనుకూలుడైన ఎమ్యూనుల్ మాక్రన్‌కు మెజార్టీ లభించడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారాన్ని మదుపర్లు ఎక్కువగా విక్రయించడం ప్రారంభించారు. దీంతో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మరింత దిగజారింది. ఔన్స్ పుత్తడి 0.11శాతం తగ్గి 1276.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సింగపూర్ మార్కెట్ లో 0.27శాతం పడిపోయి ఔన్స్ ధర 1272 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ప్రభావం ఇటు దేశీయ మార్కెట్లపైనా పడింది. మంగళవారంఉదయం ఎంసీక్స్ లో 10 గ్రాముల బంగారం ధర 0.41 శాతం తగ్గి 29,012 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు లాభాలతో దూసుకెళుతున్న మార్కెట్లలో జువెల్లరీ స్టాక్స్‌లో ఒక్కసారిగా బైయింగ్ ట్రెండ్ నెలకొంది. జీఎస్టీని 3 శాతానికి పరిమితం చేస్తారనే వార్తలు ఈ స్టాక్స్‌లో జోష్ నింపాయి. గోల్డ్‌పై ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి మళ్లింది.దీంతో ఈ స్టాక్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. అయితే బంగారంపై ఎంత పన్ను విధించాలనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ కాకుండా ప్రధాని కార్యాలయం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం బీఎస్ఈలో త్రిభువన్దాస్ బీమ్‌జీ జవేరి(టిబిజెడ్)7 శాతం, గీతాంజలి జెమ్స్ 4 శాతం, లిప్సా జెమ్స్ 5 శాతం చొప్పున లాభపడ్డాయి.మిగిలిన షేర్లు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. పిసి జ్యువెలర్స్ 2 శాతం, రినైసన్స్ 2 శాతం, తారా జ్యువెల్స్ 1 శాతం వరకూ పెరగడం విశేషం. -
గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి..
– చెరువులో మునిగి బాలుడి మృతి – నకిరేకల్‌లో విషాదం నకిరేకల్ గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి చెరువులో పడి ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన నకిరేకల్ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మూసీరోడ్డులో నివాసముంటున్న గోపగాని కోటయ్య కుమారుడు ఎల్లేష్ (11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన అనంతరం నివాసం సమీపంలోని కాలంవారి చెరువు సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ గేదెల కాపరి చెరువులో ఉన్న తన గేదెలను తోలుకురావాలని ఎల్లేష్‌ను కోరాడు. దీంతో ఎల్లేష్ చెరువులోకి వెళ్లి వాటిని బయటికి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయాడు. కాపరి గమనించి కేకలు వేయగా స్థానికులు వచ్చి అతడిని బయటికి తీసే లోపలే మృత్యువాతపడ్డాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. -
ఈ బాబా వాచీ ఖరీదు రూ.27 లక్షలట!
హరిద్వార్: సాధారణంగా బాబా, సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అనుకుంటాం. కానీ ఇటీవల హరిద్వార్‌లో అర్ధ కుంభమేళాకు హాజరైన ఓ బాబాను చూస్తే ఈ అభిప్రాయం తప్పేమోనన్న అనుమానం కలుగుతుంది. ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతూ సదరు సన్యాసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఏకంగా మూడున్నర కిలోల బంగారాన్ని ధరించి గంగానదిలో స్నానమాచరించి వస్తున్న బాబాను చూసి అక్కడున్నవారంతా నోళ్లు వెళ్లబెట్టారు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు, కమండలం తదితరాలతో సాదాసీదాగా ఉండాల్సిన సన్యాసి కాస్తా రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో మెరిసిపోయాడు. ఒకటా రెండా మెడ నిండా బంగారు గొలుసులు, లాకెట్లు.. అన్ని చేతివేళ్లకు బరువైన ఉంగరాలు. చేతికి పెద్ద వెడల్పాటి కడియం, డైమండ్ వాచ్. ఇలా సన్యాసులకు భిన్నమైన అవతారంతో తన శిష్యులు, అనుచరుల మందీ మార్బలంతో గంగా స్నానమాచరించడం ఆసక్తికరంగా మారింది. వజ్రాలు పొదిగిన ఆయన చేతి వాచీ సుమారు రూ. 27 లక్షల ఖరీదు చేస్తుందట. అయితే సన్యాసికి ఇంత బంగారం ఎందుకు అని ఎవరైనా అంటే ఈ బాబా అనుచరులు, శిష్యులకు కోపం వస్తుంది. బంగారం ఎంత స్వచ్ఛమో, ఎంత అమూల్యమో తమ గురువుకూడా అంతే విలువైనవాడంటూ వెనకేసుకొస్తున్నారు. మా గోల్డెన్ బాబా సేవలు అమూల్యమైనవంటూ మురిసిపోతున్నారు కాగా గోల్డెన్ బాబాగా చెప్పుకునే ఈయన గతంలో ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసేవాడట. ఈయన అసలు పేరు సుధీర్ కుమార్ మక్కడ్(53 ). అయితే అప్పుడు ఎన్నో పాపాలు, పొరబాట్లు చేశానంటున్నాడీ గోల్డెన్ బాబా. ఆ పాపాలను కడిగేసుకోవడానికి సన్యాసిగా మారిపోయానంటున్నాడు. వ్యాపారం చేసే క్రమంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సన్యాసం స్వీకరించానని చెబుతున్నాడు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కష్టపడుతున్న పేద తలిదండ్రులకు, ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు సహాయం చేస్తుంటానని చెబుతున్నాడు. -
పుణ్యస్నానాలు చేసిన ముస్లింలు
నిర్మల్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం గంజాన్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం మత సామరస్యాన్ని చాటుకుంది. గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కుటుంబ సభ్యులు ఆదివారం సోన్ పుష్కర ఘాట్‌లో స్నానం ఆచరించారు. గత పుష్కరాల సమయంలో తమ పెద్దలు స్నానాలు చేశారని, ఈ సారి తాము ఆ విధానాన్ని కొనసాగించామని వారు తెలిపారు.