గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి.. | A child dip in pond died | Sakshi
Sakshi News home page

గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి..

Published Sat, Sep 10 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి..

గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి..

– చెరువులో మునిగి బాలుడి మృతి
– నకిరేకల్‌లో విషాదం
నకిరేకల్‌
గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి చెరువులో పడి ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన నకిరేకల్‌ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మూసీరోడ్డులో నివాసముంటున్న గోపగాని కోటయ్య కుమారుడు ఎల్లేష్‌ (11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన అనంతరం నివాసం సమీపంలోని కాలంవారి చెరువు సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ గేదెల కాపరి చెరువులో ఉన్న తన గేదెలను తోలుకురావాలని ఎల్లేష్‌ను కోరాడు. దీంతో ఎల్లేష్‌ చెరువులోకి వెళ్లి వాటిని బయటికి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయాడు. కాపరి గమనించి కేకలు వేయగా స్థానికులు వచ్చి అతడిని బయటికి తీసే లోపలే మృత్యువాతపడ్డాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement