ponddied
-
విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి నలుగురు మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లిన ఓ బాలుడు చెరువులో మునిగిపోయాడు. ఈ క్రమంలో చెరువులో మునిగిపోతున్న బాలుడిని ఓ మహిళ కాపాడబోయింది. దీంతో, సదరు మహిళ కూడా చెరువులో పడి మునిగిపోయింది. వీరిద్దరూ గమనించిన మరో ఇద్దరు మహిళలు వీరిని కాపాడబోయి.. చెరువు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం, స్థానికుల సహాయంలో ముగ్గురు మహిళ మృతదేహాలను బయటకు తీశారు. బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది కూడా చదవండి: విషాదాన్ని మిగిల్చిన ప్రయాణం -
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా...
-
చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
-
గుండె చెరువు!
పశువులను మేతకు తీసుకెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కాశీపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గూనూరు మంగునాయుడు (50) ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. సాక్షి, దేవరాపల్లి: కాశీపురం గ్రామానికి చెందిన గూనూరు మంగునాయుడు ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం పశువులను మేతకు తీసుకెళ్లాడు. అయితే పశువులు 11 గంటల ప్రాంతంలో పాకకు వచ్చేయగా మంగునాయుడు మాత్రం రాలేదు. మధ్యాహ్నమైన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. పశువులను మేతకు తీసుకెళ్లిన ప్రాంతంతో పాటు పంట పొలాల్లోను, చుట్టు పక్కల వారిని ఆరా తీసిన ఆచూకీ లభించక పోవడంతో కుటుంబీకుల్లో మరింత ఆదోళన నెలకొంది. ఈ క్రమంలోనే సాయంత్రం కాశీపురం –నాగయ్యపేట రహదారిలో గల రాచ చెరువులో మంగునాయుడు టోపీ తేలియాడటాన్ని స్థానికులు గుర్తించి విషయాన్ని అతని కుటుంబీ కులకు చేరవేశారు. దీంతో చెరువులో గాలించటంతో మృతదేహం బయటపడింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన మంగునాయుడు తిరిగిరాని లోకాలు వెళ్లిపోవడంతో ఆయన భార్య నాగమణి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడివారిని కంటతడిపెట్టించింది. అందరితో కలిసిమెలిసి ఉండే మంగునాయుడు మృతితో కాశీపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య నాగమణితోపాటు పెద్ద కుమారుడు వెంకటేష్ (బీటెక్), అప్పలనాయుడు(డిప్లొమో) ఉన్నారు. వీరిద్దరూ విశాఖపట్నంలో చదువుకుంటున్నా రు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఏఎస్సై కె.దేముడునాయుడు, కానిస్టేబుల్ గాంధీ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని చెరువులోనుంచి బయటకు తీయించారు. చెరువులోకి వెళ్లిన పశువులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగునాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను స్థానిక వైఎస్సార్సీపీ నాయుకులు బొడ్డు పేరునాయుడు, దాసరి మంగునాయుడు, దాసరి గోపి, చలుమూరి మోహన్, ఆదిరెడ్డి వెంకటరావు తదితరులు పరామర్శించారు. -
గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి..
– చెరువులో మునిగి బాలుడి మృతి – నకిరేకల్‌లో విషాదం నకిరేకల్ గేదెలను తోలుకెళ్లేందుకు వెళ్లి చెరువులో పడి ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన నకిరేకల్ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మూసీరోడ్డులో నివాసముంటున్న గోపగాని కోటయ్య కుమారుడు ఎల్లేష్ (11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన అనంతరం నివాసం సమీపంలోని కాలంవారి చెరువు సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ గేదెల కాపరి చెరువులో ఉన్న తన గేదెలను తోలుకురావాలని ఎల్లేష్‌ను కోరాడు. దీంతో ఎల్లేష్ చెరువులోకి వెళ్లి వాటిని బయటికి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయాడు. కాపరి గమనించి కేకలు వేయగా స్థానికులు వచ్చి అతడిని బయటికి తీసే లోపలే మృత్యువాతపడ్డాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు.