విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు.. | Four People Drowned In Pond At Medak Manoharabad Mandal - Sakshi
Sakshi News home page

విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు..

Published Mon, Sep 25 2023 4:01 PM | Last Updated on Mon, Sep 25 2023 4:22 PM

Four People Drowned In Pond At Medak Manoharabad - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి నలుగురు మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 

వివరాల ప్రకారం.. మనోహరాబాద్‌ మండలం రంగయ్యపల్లిలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లిన ఓ బాలుడు చెరువులో మునిగిపోయాడు. ఈ క్రమంలో చెరువులో మునిగిపోతున్న బాలుడిని ఓ మహిళ కాపాడబోయింది. దీంతో, సదరు మహిళ కూడా చెరువులో పడి మునిగిపోయింది. వీరిద్దరూ గమనించిన మరో ఇద్దరు మహిళలు వీరిని కాపాడబోయి.. చెరువు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. 

ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం, స్థానికుల సహాయంలో ముగ్గురు మహిళ మృతదేహాలను బయటకు తీశారు. బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇది కూడా చదవండి:  విషాదాన్ని మిగిల్చిన ప్రయాణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement