అటు అక్షయ తృతీయ, ఇటు దిగివస్తున్న పుత్తడి | Gold futures dip to Rs. 29,012 on weak global cues | Sakshi
Sakshi News home page

అటు అక్షయ తృతీయ, ఇటు దిగివస్తున్న పుత్తడి

Published Tue, Apr 25 2017 2:36 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

అటు అక్షయ తృతీయ, ఇటు దిగివస్తున్న పుత్తడి

ముంబై:ముంబై: ఒకవైపు అక్షయ తృతీయ( ఏప్రిల్‌ 28) సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగి రావడం శుభసూచికంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌ ఎన్నికల తొలిరౌండ్‌ ఫలితాల్లో యూరో అనుకూలుడైన ఎమ్యూనుల్‌ మాక్రన్‌కు మెజార్టీ లభించడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారాన్ని మదుపర్లు ఎక్కువగా విక్రయించడం ప్రారంభించారు. దీంతో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర మరింత దిగజారింది. ఔన్స్‌ పుత్తడి 0.11శాతం తగ్గి 1276.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సింగపూర్‌ మార్కెట్‌ లో 0.27శాతం పడిపోయి ఔన్స్‌ ధర 1272 డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయ ప్రభావం ఇటు దేశీయ మార్కెట్లపైనా పడింది. మంగళవారం​ఉదయం ఎంసీక్స్‌ లో 10 గ్రాముల బంగారం ధర 0.41 శాతం తగ్గి 29,012 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు  లాభాలతో దూసుకెళుతున్న మార్కెట్లలో  జువెల్లరీ స్టాక్స్‌లో ఒక్కసారిగా బైయింగ్ ట్రెండ్‌ నెలకొంది. జీఎస్టీని 3 శాతానికి పరిమితం చేస్తారనే వార్తలు ఈ స్టాక్స్‌లో జోష్ నింపాయి. గోల్డ్‌పై ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి మళ్లింది.దీంతో ఈ స్టాక్స్‌ మెరుపులు మెరిపిస్తున్నాయి. అయితే బంగారంపై ఎంత పన్ను విధించాలనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ కాకుండా ప్రధాని కార్యాలయం నిర్ణయం  తీసుకోనుందని తెలుస్తోంది.
 
ప్రస్తుతం బీఎస్ఈలో త్రిభువన్‌దాస్ బీమ్‌జీ జవేరి(టిబిజెడ్)7 శాతం, గీతాంజలి జెమ్స్ 4 శాతం, లిప్సా జెమ్స్ 5 శాతం చొప్పున లాభపడ్డాయి.మిగిలిన షేర్లు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. పిసి జ్యువెలర్స్ 2 శాతం, రినైసన్స్ 2 శాతం, తారా జ్యువెల్స్ 1 శాతం వరకూ పెరగడం  విశేషం. 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement