weak global cues
-
బంగారం ధరలు మరింత దిగి వస్తాయా?
ముంబై: బంగారం ధరలు మరింత పతనం దిశగా కదులుతున్నాయి. బలహీనమైన అంతర్జాతీయ ధోరణికారణంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ తరువాతి అధ్యక్షుడిగా ఇమ్మాన్యూల్ మాక్రోన్ ఎన్నిక కానున్నారనే అవుతుందనే అంచనాలు , అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలకుతోడు బ్లూచిప్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌తో కూడుకున్న స్టాక్స్‌లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ఫ్యూచర్స్ పది గ్రాముల రూ. 121 నుంచి రూ .28,693 స్థాయికి పడిపోయింది. అలాగే మరో విలువైన లోహం వెండి సైతం ఫ్యూచర్స్ మార్కెట్ లో వెండి ధర కిలోధర రూ. 149 లు క్షీణించి రూ.40,778గాఉంది. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం క్షీణించి 1264 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. వెండి కూడా ఔన్స్ స్వల్ప క్షీణతతో 17.65 డాలర్లకు చేరింది. ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడటంతో ఇన్వెస్టర్లు పసిడి వంటి రక్షణాత్మక పెట్టుబడుల నుంచి స్టాక్స్, బాండ్లు వంటి సాధనాలవైపు దృష్టి మరల్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాదు ఇవిమరింత క్షీణించే అవకాశాలున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. సిల్వర్ లో కూడా ఇదే ధోరణి ఉండొచ్చని భావిస్తున్నారు. సిల్వర్ ఓన్స్ 17 డాలర్లకు దిగివచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. ట్రేడింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటు దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ 30 వేలు దాటగా, నిఫ్టీ 9350 వద్ద ఆల్‌టైం హైని దాటి స్థిరంగా ఉన్నాయి. దీనికితోడు డాలర్ మారకంలో రుపీ 20 నెలల గరిష్టాన్ని నమోదు చేసి తొలిసారి రూ.64 దిగువకు చేరడం విశేషం. -
అటు అక్షయ తృతీయ, ఇటు దిగివస్తున్న పుత్తడి
ముంబై:ముంబై: ఒకవైపు అక్షయ తృతీయ( ఏప్రిల్ 28) సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగి రావడం శుభసూచికంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ ఎన్నికల తొలిరౌండ్ ఫలితాల్లో యూరో అనుకూలుడైన ఎమ్యూనుల్ మాక్రన్‌కు మెజార్టీ లభించడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారాన్ని మదుపర్లు ఎక్కువగా విక్రయించడం ప్రారంభించారు. దీంతో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మరింత దిగజారింది. ఔన్స్ పుత్తడి 0.11శాతం తగ్గి 1276.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సింగపూర్ మార్కెట్ లో 0.27శాతం పడిపోయి ఔన్స్ ధర 1272 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ప్రభావం ఇటు దేశీయ మార్కెట్లపైనా పడింది. మంగళవారంఉదయం ఎంసీక్స్ లో 10 గ్రాముల బంగారం ధర 0.41 శాతం తగ్గి 29,012 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు లాభాలతో దూసుకెళుతున్న మార్కెట్లలో జువెల్లరీ స్టాక్స్‌లో ఒక్కసారిగా బైయింగ్ ట్రెండ్ నెలకొంది. జీఎస్టీని 3 శాతానికి పరిమితం చేస్తారనే వార్తలు ఈ స్టాక్స్‌లో జోష్ నింపాయి. గోల్డ్‌పై ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి మళ్లింది.దీంతో ఈ స్టాక్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. అయితే బంగారంపై ఎంత పన్ను విధించాలనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ కాకుండా ప్రధాని కార్యాలయం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం బీఎస్ఈలో త్రిభువన్దాస్ బీమ్‌జీ జవేరి(టిబిజెడ్)7 శాతం, గీతాంజలి జెమ్స్ 4 శాతం, లిప్సా జెమ్స్ 5 శాతం చొప్పున లాభపడ్డాయి.మిగిలిన షేర్లు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. పిసి జ్యువెలర్స్ 2 శాతం, రినైసన్స్ 2 శాతం, తారా జ్యువెల్స్ 1 శాతం వరకూ పెరగడం విశేషం.