ఊరట: దిగొస్తున్న పుత్తడి ధరలు | Gold price dips to Rs 46,750 per 10 gm silver declines  | Sakshi
Sakshi News home page

ఊరట: దిగొస్తున్న పుత్తడి ధరలు

Published Fri, Feb 26 2021 12:08 PM | Last Updated on Fri, Feb 26 2021 3:21 PM

 Gold price dips to Rs 46,750 per 10 gm silver declines  - Sakshi

సాక్షి, ముంబై: నిన్నమొన్నటి దాకా చుక్కల్ని తాకిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అన్‌సీజన్‌, ద్రవ్యోల్బణ ఆందోళనలు, డాలర్‌ బలం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ పుత్తడి గరిష్టాలనుంచి వెనక్కి తగ్గుతోంది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గి ధర  47,340 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల కూడా రూ.10 క్షీణించి రూ. 43,390కు చేరుకుంది. దేశీయ ఫ్యూచర్‌మార్కెట్లో  పసిడి  పదిగ్రాములకు28 రూపాయలు క్షీణించి 46213 వద్ద ఉండగా, 500 రూపాయలు పడిన వెండి 68700 స్థాయికి చేరింది.  బంగారం ధరలు 8 నెలల కనిష్టానికి సమీపానికి చేరువలో ఉండటంతోపాటు, రికార్డు స్థాయినుంచి  10 వేల రూపాయలు  దిగి వచ్చినట్టయింది.

న్యూఢిల్లీలో  24  క్యారెట్ల పుత్తడి ధర 46,750 స్థాయికిచేరింది. వెండి ధర సిల్వర్ ధర కిలోకు రూ .70,200  స్థాయికి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 45,550 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో  450 రూపాయలు తగ్గి 43,720 రూపాయలకు పడిపోయింది. అటు యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి 1,767.60 డాలర్లకు చేరుకుంది. యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ ఏడాది గరిష్టానికి చేరడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోందని డైలీఎఫ్ఎక్స్ వ్యూహకర్త మార్గరెట్ యాంగ్  వ్యాఖ్యానించారు.  మెరుగైన ఆర్థిక సెంటిమెంట్ ,ద్రవ్యోల్బణ ఆందోళనలు  యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ గరిష్టానికి చేరాయనీ, ఇది బంగారంలో అమ్మకాలకు దారితీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ కమోడిటీస్ హరీష్ వీ అన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల భారీ పతనంతో  దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారిన సెన్సెక్స్‌ ఏకంగా 1540 పాయింట్లు నష్టపోవడం గమనార‍్హం. దాదాపు  అన్ని రంగాలు భారీగా నష్టపోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement