డోజ్‌కు  రీడ్‌ ఓన్లీ యాక్సెస్‌  | Elon Musk Has Read Only Access to US Payment Systems | Sakshi

డోజ్‌కు  రీడ్‌ ఓన్లీ యాక్సెస్‌ 

Feb 6 2025 6:33 AM | Updated on Feb 6 2025 9:06 AM

Elon Musk Has Read Only Access to US Payment Systems

వాషింగ్టన్‌: ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థలో ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్‌)కు ‘రీడ్‌ ఓన్లీ యాక్సెస్‌’మాత్రమే ఉందని అమెరికా ట్రెజరీ శాఖ తెలిపింది. ఫెడరల్‌ ప్రభుత్వ చెల్లింపు వ్యవస్థలో డోజ్‌ ప్రమేయం భద్రతకు ముప్పన్న కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం వారికి ఈ మేరకు లేఖ రాసింది. 

డోజ్‌కు అనుమతివ్వడం వల్ల సామాజిక భద్రత, మెడికేర్‌ వంటి చెల్లింపుల్లో ఆలస్యం, దారి మళ్లింపుల వంటివేవీ జరగవని పేర్కొంది. సున్నితమైన చెల్లింపు వ్యవస్థలకు డోజ్‌ను అనుమతిండాచన్ని నిరసిస్తూ వందలాది మంది మంగళవారం ట్రెజరీ భవనం ముందు ఆందోళనకు దిగారు. ‘మస్‌్కను బహిష్కరించాలి’, ‘ట్రంప్‌ డౌన్‌ డౌన్‌’, ‘డూ యువర్‌ జాబ్‌ కాంగ్రెస్‌’అంటూ నినాదాలు చేశారు. డజను మందికి పైగా డెమొక్రటిక్‌ చట్టసభ సభ్యులు వారికి సంఘీభావంగా మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement