నా భర్త కుట్ర పన్నుతున్నాడు: సరిత
చెన్నై : తనకు వ్యతిరేకంగా తన భర్త కుట్ర పన్నుతున్నాడని అలనాటి దక్షిణాది హీరోయిన్ సరిత ఆరోపించారు. సరిత మలయాళ నటుడు ముఖేష్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మనస్పర్థలు కారణంగా చాలాకాలంగా విడిపోయి జీవిస్తున్న ఈ దంపతులు... తమ వివాహం రద్దు కోరుతూ కేరళలోని ఎర్నాకుళం కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు వ్యవహారంలో తనకు నోటీసులు సక్రమంగా అందటం లేదని నటి సరిత ఆరోపణలు చేశారు. వివాహ రద్దు విషయంలో తన వాదన చెప్పుకోవడానికి తగిన సమయాన్ని కేటాయించటం లేదని ఆమె వాపోయారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పిల్లల చదువుల నిమిత్తం ఆమె దుబాయ్ లో నివసిస్తోంది. ప్రస్తుతం తన ఇద్దరు బిడ్డలు శ్రవణ్ ముఖేష్, తేజాస్ ముఖేష్ ఆలనా పాలనా కూడా తనే చూసుకుంటున్నానని సరిత పేర్కొన్నారు.