ఓటింగ్ గందరగోళం.. నలుగురు అధికారుల అరెస్ట్‌ | vote at home mix up Four election officials arrested in Kozhikode | Sakshi
Sakshi News home page

ఓటింగ్ గందరగోళం.. నలుగురు అధికారుల అరెస్ట్‌

Published Thu, Apr 25 2024 5:54 PM | Last Updated on Thu, Apr 25 2024 5:56 PM

vote at home mix up Four election officials arrested in Kozhikode - Sakshi

కోజికోడ్: కేరళ కోజికోడ్‌లోని పెరువాయల్‌లో ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ గందరగోళానికి సంబంధించిన సంఘటనకు సంబంధించి నలుగురు ఎన్నికల అధికారులను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. మావూరు ఎస్‌ఐ పీఎన్‌ మురళీధరన్‌ ఆధ్వర్యంలో అరెస్టులు జరిగాయి.

అరెస్టయినవారిలో ప్రత్యేక పోలింగ్ అధికారి, కోడెంచెరి ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటీ మంజుష, పోలింగ్ అధికారి, పరప్పిల్ ఎంఎంవీహెచ్‌ఎస్‌ఎస్‌ యూపీ అసిస్టెంట్  సీవీ ఫహ్మిదా, మైక్రో అబ్జర్వర్, కోజికోడ్ ప్రభుత్వ న్యాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పీకే అనీస్, బూత్ లెవల్ ఆఫీసర్, మన్నూరు సీఎంహెచ్‌ఎస్‌ఎస్‌ ఉపాధ్యాయుడు హరీష్ కుమార్ ఉన్నారు.  

కోజికోడ్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కున్నమంగళం నియోజకవర్గంలోని బూత్ నంబర్ 84లో గత శుక్రవారం ఈ సంఘటన జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఓటరుకు కేటాయించిన ఓటు గల్లంతైనట్లు తేలింది. పాయంపురత్ జానకి అమ్మ (91)కు బదులుగా కొడస్సేరి జానకి అమ్మ (80)తో అధికారులు ఓటు వేయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement