
త్రిస్సూర్: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం చెందగా బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తనువు చాలించాడు. తాజాగా ప్రముఖ మలయాళ దర్శకుడు సాచీ కన్నుమూశారు. త్రిస్సూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం మరణించారు. కొద్ది రోజుల క్రితం సాచీ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో అతనికి జూన్ 16న గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం కేరళలోని త్రిస్సూర్‌లో జూబ్లి మిషన్ ఆసుపత్రికి తరలించారు. (బాయ్‌కాట్ సల్మాన్)
ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యానికి ఆయన శరీరం స్పందించకపోవడంతో గురువారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా సాచీ పూర్తి పేరు కెఆర్ సచ్చిదానందన్. 2015లో ఆయన దర్శకుడిగా వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఆయన చివరిసారిగా పృథ్వీ సుకుమారన్ హీరోగా నటించిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" చిత్రానికి పని చేశాడు. ఇది సంచలన విజయాన్ని నమోదు చేసుకుని సాచీకి మంచి పేరును తెచ్చిపెట్టింది. (నిరాడంబరంగా నటుడి పెళ్లి)