మైసూరు: ఈసారి మైసూరు దసరా మహోత్సవాలకు 14 ఏనుగులను సిద్ధం చేయాలని తీర్మానించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఆడ ఏనుగులకు గర్భనిర్ధారణ పరీక్షలు చేయాలని తీర్మానించింది. గత ఏడాది దసరా ఉత్సవాల్లో రామాపుర క్యాంపులో లక్ష్మి అనే ఏనుగు మగ ఏనుగుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
గర్భిణి ఏనుగును దసరా మహోత్సవం కోసం చేసే ప్రాక్టీస్‌కు తీసుకురావడంపై గతంలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో గర్భధారణ పరీక్షలు చేయాలని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏనుగుల శిబిరంలో గర్భనిర్ధారణ పరీక్షల అనంతరం వాటిని దసరా మహోత్సవాల కోసం తీసుకెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment