
పక్కుడుభద్ర ఆలయంలోకి ప్రవేశిస్తున్న ఏనుగుల గుంపు
భామిని: మండలంలోని పక్కుడుభద్ర సమీపంలో జీర్ణోద్ధరణ జరుగుతున్న స్వయం భూ దేవాలయంలోకి గురువారం ఆరు ఏనుగుల గుంపు ప్రవేశించి ప్రత్యేకత చాటుకుంది. ఏనుగులు ప్రతి రోజూ ఆలయంలోకి ప్రవేశిస్తున్నాయని స్థానికులు చెబుతుంటారు.
అయితే వాస్తవంగా స్వయం భూ దేవాలయంలోకి ఏనుగులు ప్రవేశించి గంట కొట్టాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. బత్తిలికి చెందిన శాసనపురి కుటుంబసభ్యులతో జీర్ణోద్ధరణ జరుగుతున్న ఆలయంలోకి ఏనుగులు ప్రవేశించడంపై విశేష ప్రచారం కొనసాగుతోంది. ఇంతవరకు పంట నష్టాలపై చెప్పుకునే రైతులు, ఇప్పుడు ఏనుగుల ఆలయ ప్రవేశంపై ప్రచారం చేస్తున్నారు.