Watch: Elephant Struggling To Pluck A Jackfruit From A Tree, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు

Published Mon, Aug 1 2022 8:34 PM | Last Updated on Tue, Aug 2 2022 10:42 AM

Viral Video: Elephant Struggling To Pluck A Jackfruit From A Tree - Sakshi

ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు చూశాం. జంతువులు తమ ఆహారాన్ని తినే ఫన్నీ వీడియోలు కూడా చూశాం. ఐతే ఇక్కడొక ఏనుగు తనకి ఇష్టమైన పనకాయ కోసం ఎంతలా ప్రయత్నించిందో చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పైగా ఆ చెట్టు ఆ ఏనుగుకి అందనంతా ఎత్తులో ఉంది. అయినా సరే ఎలాగోలా ఆ పనసకాయను కోసేందుకు తెగ ట్రై చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఏనుగు పనసకాయ కోసేందుకు దాని ముందరి కాళ్లను పైకి ఎత్తి చెట్టుకి తొక్కిపెట్టి మరీ కోసేందుకు ప్రయత్నిస్తోంది. ఆఖరికి తొండాన్ని ఎలాగోలా బాగా పైకి ఎత్తి ఆ పనసకాయను కోసేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. 

(చదవండి: Viral Video: అవమానపడ్డ టూరిస్ట్‌...టచ్‌ చేయకూడనవి టచ్‌ చేస్తే ఇలానే ఉంటుంది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement