
న్యూఢిల్లీ: ఓ ఏనుగు పిల్ల చెట్టెక్కి పనస కాయలను కోస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెట్టుకు ఉన్న ఆ పనస కాయలను కోయడానికి ఏనుగు చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. 29 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఆటవీ శాఖ అధికారి సాకేత్ బడోలా సోమవారం ట్విటర్‌లో షేర్ చేశాడు. (ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..)
దీనికి ‘జాక్‌ఫ్రూట్ పట్ల మీకున్న మక్కువ.. అది మిమ్మల్ని చెట్లు ఎక్కేలా చేస్తుంది’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటీ వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. గజరాజు పనస కాయల కోసం చెట్టు ఎక్కడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఉత్తమమైన దొంగతనం’, ‘మనసుంటే మార్గం ఉంటుంది’, ‘అద్భుతం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (కంటతడి పెట్టించావురా బుడ్డోడా..)