వైరల్‌: పిల్ల ఏనుగు చిలిపి చేష్టలు చూస్తే నవ్వు ఆపుకోలేరు! | Viral Video: Baby Elephant Fun With Caretaker Goes Netizens Laugh | Sakshi
Sakshi News home page

Funny Video: ఏయ్‌ నిన్నే.. పిలుస్తుంటే పట్టించుకోవా.. పంతం నెగ్గించుకున్న పిల్ల ఏనుగు

Published Thu, Oct 14 2021 5:33 PM | Last Updated on Fri, Oct 15 2021 4:03 AM

Viral Video: Baby Elephant Fun With Caretaker Goes Netizens Laugh - Sakshi

చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుంది. అందుకే వాటిని వీడియోలో బంధించి జ్ఞాపకంగా ఉంచుకుంటాం. అలానే కొన్ని జంతువులు చేసే చిలిపి చేష్టలు కూడా మనకి భలే సరదానిస్తాయి. ఇటీవల ఈ తరహా జంతువుల వీడియోలు అందులో ప్రత్యేకంగా ఏనుగులవి నెటిజన్లకు విపరీతంగా నచ్చుతున్నాయి. తాజాగా ఓ పిల్ల ఏనుగు తను సంరక్షుడిని ఆట పట్టించే వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. ఓ పిల్ల ఏనుగు కేర్‌ టేకర్‌ పని చేసుకుంటూ బిజీగా ఉంటాడు. పాపం మన బేబీ ఏనుగుకి ఆడుకోవడానికి ఎవరూ లేకపోవడంతో బోరు కొడుతుంది. అది ఎంటి మన మావటి వాడు మనల్ని పట్టించుకోవడం లేదని అనుకుంది. వెంటనే అతని వద్దకు వెళ్లి తొండంతో పిలుస్తుంది. అయితే మనోడు అదంతా పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటాడు. దీంతో అది హర్ట్‌ అయ్యి పిలుస్తుంటే పట్టించుకోవా అంటూ అతని చేస్తున్న పనిని డిస్ట్రబ్‌ చేస్తుంది. చివరకు ఆ కేర్‌ టేకర్‌ వెనక్కి తిరిగి దాన్ని సముదాయించే వరకు అది పసి పిల్లాడిలో ఓ రేంజ్‌లో అల్లరి చేసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. 

చదవండి: Viral Video: డ్యాన్స్‌ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement