Sri Lanka Yala National Park: Elephant Try to Lift Tourist Vehicle - Sakshi
Sakshi News home page

ఏనుగు ముందు ఎందుకలా పరిగెడుతున్నాడు..?

Published Thu, Mar 24 2022 3:22 PM | Last Updated on Thu, Mar 24 2022 6:55 PM

Sri Lanka Yala National Park: Elephant Try to Lift Tourist Vehicle - Sakshi

లైవ్‌లో అడవి జంతువులను చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ.. అవి కాస్త రివర్స్‌ అయితే మాత్రం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పరుగులెత్తాల్సి వస్తుంది.. ఇదిగో ఇక్కడ జరిగింది అదే. శ్రీలంకలోని యాలా నేషనల్‌ పార్కులో ఓ మదగజం రెచ్చిపోయి.. పర్యాటకులు ఉన్న వాహనాన్ని ఎత్తి పడేయడానికి  ప్రయత్నించింది.

ఇంతలో ఆ పార్కు రేంజర్‌ ఒకరు సాహసం చేసి.. చాకచక్యంగా ఏనుగుకు మస్కా కొట్టి.. వాహనం ఎక్కి.. పర్యాటకులను సురక్షిత ప్రాంతానికి తరలించాడు.. ఈ ఉద్విగ్నభరిత చిత్రాన్ని శ్రీలంకకు చెందిన డాక్టర్‌ లలిత్‌ క్లిక్‌మనిపించారు. ఇంతకీ ఆ సాహస రేంజర్‌ ఎక్కడనేగా మీ డౌటు.. చిత్రంలో ఏనుగు ముందు పరుగులు పెడుతున్నాడుగా.. ఆయనే!! (క్లిక్‌: సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement