
ఆఫ్రికా: జంతువులు తమ పిల్లల జోలికి వస్తే ఎంతలా దాడి చేస్తాయో అందరికి తెలిసిందే. పైగా అవి చాలా సార్లు తమ సంతానాన్ని కాపాడుకోవటం కోసం తమ కన్న పెద్ద జంతువులతో పోరాడటానికి కూడా వెనకాడవు. అచ్చం అలాంటి సంఘటనే జాంబియా దేశంలో చోటు చేసుకుంది. నిజానికి ఏనుగులు ఎక్కడకి వెళ్లిన గుంపులు గుంపలుగా వెళ్లతాయి. అయితే ఇక్కడ ఒక తల్లి ఏనుగు తన పిల్లలతో నీళ్లు తాడగడం కోసం నదిలోకి దిగుతుంది.
(చదవండి: 900 ఏళ్ల నాటి పురాతన కత్తి)
అంతే ఇంతలో ఒక్కసారిగా ఒక మొసలి ఆ పిల్ల ఏనుగులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తల్లి ఏనగు కోపంతో ఆ మొసలిపై దాడి చేయడమే కాక తొండంతో ఒడిసి పట్టుకుని కాళ్లతో తొక్కి చంపేస్తుంది. అయితే ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగినప్పటికీ ప్రస్తుతం మళ్లీ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తల్లి ఏనుగుతో గొడవపడకండి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.