అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నా పగటి ఉష్టోగ్రతల్లో పెద్దగా మార్పు రావడం లేదు. వేడిగాలులతో జనం అల్లాడుతున్నారు. కూలర్లు, ఏసీలు లేకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మనుషులే కాదు, ఇతర ప్రాణులు కూడా ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాయనడానికి ఈ చిత్రమే ఉదాహరణ. అదేంటొో చూసేయండి..
కరీంనగర్ భాగ్యనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఒక గదికి ఏసీ అమర్చబడి ఉండడంతో.. ఆ గోడ రంధ్రంలోంచి చల్లటి గాలి వీస్తుంది. వాతావరణ వేడిని తట్టుకోలేని రామచిలుకలు ఏసీ రంధ్రం వద్ద అలరిస్తూ కనిపించాయి. అవి వంతులవారీగా, ఒకదాని తరువాత మరొకటి.. ఆ రంధ్రంలో దూరుతూ.. ఏసీ నుంచి వస్తున్న చల్లటి గాలికి సేదతీరుతూ ఉన్నాయి. వెంటనే ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
ఇవి చదవండి: ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!
Comments
Please login to add a commentAdd a comment