ఒక్కో సమస్యకు ఒక్కో‘టీ’..
మూడ్ బాగాలే నప్పుడు, కాస్త అలసటగా, మరికాస్త చిరాగ్గా అనిపించి నప్పుడు వేడివేడి టీ తాగడం చాలామందికి అలవాటే. అయితే, ఒక్కోరకం సమస్యకు ఒక్కోరకం టీ తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని లండన్‌లోని భారత సంతతికి చెందిన తేనీటి నిపుణుడు అజిత్ మదన్ చెబుతున్నారు. ఆందోళనగా ఉన్నప్పుడు, శరీరం కాస్త వేడెక్కాలనుకున్నప్పుడు దాల్చినచెక్క టీ మంచిదని, ఒత్తిడిని జయించాలనుకున్నప్పుడు లెమన్ వెర్బనా టీ సత్వరమే సత్ఫలితాలిస్తాయని ఆయన అంటున్నారు. అలాగే, పరీక్షల ముందు జ్ఞాపకశక్తిని చురుగ్గా ఉంచుకోవాలనుకునే విద్యార్థులకు గ్రీన్ టీ అత్యుత్తమమైనదని చెబుతున్నారు. మనసు బాగా లేనప్పుడు సోంపుతో తయారు చేసిన టీ తాగితే మూడ్ మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.