మీకు యాదుంది కదా...ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సీబీఐ ఆఫీసర్ అరుణ్‌ను చంపేస్తరు. ఎవరు చంపారు? ఎందుకు చంపారు....మొదలైన విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు న్యూరోసైంటిస్ట్ సారా (హీరోయిన్) సహాయంతో సీబీఐ ఆఫీసర్ ‘మెమోరీ’ని చిప్ రూపంలో కాంట్రాక్ట్ కిల్లర్ శంకర్ (మన హీరో) పుర్రెలో సెట్ చేస్తారు. క్రిమినల్ శంకర్ కాస్త í సీబీఐ సిన్సియర్ ఆఫీసర్ అరుణ్‌లా ప్రవర్తిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. అది సినిమా కదా...ఇక నిజజీవితంలోకి వద్దాం. ‘కోతులు కూడా ఇక ముందు వీడియోగేమ్స్ ఆడతాయి’ అని ప్రకటించాడు స్పేస్ ఎక్స్ సీయివో ఎలాన్ మాస్క్.
ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరోలింక్’ కోతి పుర్రెలో ‘చిప్’ను సెట్ చేయడానికి రెడీ అయింది. ఆతరువాత కోతిగారు మనలాగే వీడియో గేమ్స్ ఆడతారన్నమాట. (ఇది జస్ట్ ప్రారంభమేనట. ఇంకా చాలాచాలా చేస్తారట) ‘కంప్యూటర్ చిప్ కోతిపుర్రెలో ఉన్న ఆనవాలు ఏదీ ఎవరికీ కనిపించదు’ అంటున్నాడు మాస్క్. అదిసరే...కోతి ‘మెమోరీ’ చిప్‌ను మన పుర్రెలో సెట్ చేస్తే ఏందీ పరిస్థితి? నాయనా మాస్కు, మా మీద కాస్త దయచూపు!
Comments
Please login to add a commentAdd a comment