ఏ విషయాన్నైనా గుర్తుంచుకోవాలంటే బొమ్మలు గీయడానికి మించిన దగ్గర దారి లేదంటున్నారు వాటర్లూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. పదేపదే రాయడం ద్వారా బాగా గుర్తుండి పోతుందన్న విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ, బొమ్మలు గీయడమన్నది అంతకంటే మెరుగైన మార్గమని తాము ఇటీవల జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోందని మెలిస్సా మీడ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వయసు మళ్లిన తరువాత బొమ్మలు గీయడం అలవాటు చేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి లోపాలు, అలై్జ్జమర్స్, మతిమరపు వంటి సమస్యలను అధిగమించవచ్చునని మెలిస్సా అంటున్నారు. 20 – 80 మధ్య వయసు వారు దాదాపు 50 మందిపై తాము ఈ అధ్యయనం చేశామన్నారు.
రెండు గుంపులుగా విడదీసిన వీరికి వరుసగా కొన్ని పదాలు చూపినప్పుడు ఆ పదాన్ని, వివరణను రాయడంతో పాటు బొమ్మకూడా గీయాల్సి ఉంటుంది. కొంత సమయం తరువాత వాటిల్లో వీలైనన్ని పదాలను గుర్తు చేసుకోమని అడిగారు. యువకులు పదాలు బాగా గుర్తుపెట్టుకోగలిగారు. అది అసారణం కాకపోయినా బొమ్మలు గీసిన పదాలను అన్ని వర్గాల వారూ ఎక్కువగా గుర్తు పెట్టుకోవడం తమను ఆశ్చర్యం కలిగించిందని మెలిస్సా వివరించారు. ఒకేరకమైన సమాచారాన్ని పలు విధాలుగా చూపుతూండటం వల్ల బొమ్మలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయని, పైగా చేతులు కూడా తోడవడం వల్ల మెదడులో సమాచారం మరింత బాగా ముద్రపడిపోతుందని మెలిస్సా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment