Office 365
-
పైసా ఖర్చుపెట్టకుండా ఫొటోలు దాచుకోండిలా..
సాధారణంగా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో యూజర్లు డాటాను దాచుకోవడానికి ఉచిత స్టోరేజ్ ఉంటుందనేది తెలిసిందే. గూగుల్ తరపున గూగుల్ ఫొటోస్ విషయానికొస్తే 15 జీబీ ఉచిత స్పేస్ ఉంటుంది. అది నిండితే మాత్రం మరికొంత స్పేస్‌ను కొనుక్కోవాల్సిందే. లేకుంటే కొత్తగా డాటా స్టోర్ కాకపోగా.. ఆల్రెడీ సేవ్ అయిన డాటా కూడా డిలీట్ అవుతుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో(యాప్స్‌తో) ఫొటోల్ని, డాటాను దాచుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?.. టెరాబాక్స్(డ్యూబాక్స్).. గూగుల్ ఫొటోస్‌కు బెస్ట్ ప్రత్యామ్నాయం ఇది. ఈ యాప్‌లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. ఫైల్స్, ఫొటోస్, వీడియోలు, ఫోల్డర్లు ఏవైనా దాచుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాక్‌ప్‌లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్షిప్ ఉండాల్సిందే. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్ చేసుకునేందుకు ఎనేబుల్ బటన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. జియోక్లౌడ్ (ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్).. గూగుల్ ఫొటోస్‌కు ఇంకో ఉచిత ప్రత్యామ్నాయం ఇది. జియో ద్వారా క్లౌడ్ స్టోరేజ్ 50జీబీ ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. రిఫరెన్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ను పొందవచ్చు. డెగూ.. ఫొటోలు దాచుకోవడానికి మంచి మార్గం ఇది. ఇది మూడు ప్లాన్లతో ఉంటుంది. మొదటి ప్లాన్‌లో 100 జీబీ ఫ్రీ స్టోరేజ్ వస్తుంది. ఒకవేళ ప్రో లెవల్‌కు వెళ్తే.. 500 జీబీ స్టోరేజ్ ఇస్తారు. 10 టీబీ స్టోరేజ్ ప్లాన్ కూడా ఉంది. వీటితో పాటు స్పాన్సర్డ్ యాడ్స్‌ను చూసినా.. ఇతరుల్ని ఇన్వైట్ చేసినా అదనంగా మరికొంత ఫ్రీ స్టోరేజ్ ఇస్తారు. అమెజాన్ ఫొటోస్ యాప్.. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కొందరు కస్టమర్లకే అందించే యాప్ ఇది. అదీ గూగుల్‌ప్లే స్టోర్‌లో కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందిస్తోంది. 5జీబీ వరకు వీడియోలను ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫొటోలకు మాత్రం లిమిట్ ఉండదు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో.. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫ్రీ అన్లిమిటెడ్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రెగ్యులర్‌గా లభించే మిగతా ఆఫర్ల సంగతి చెప్పనక్కర్లేదు. మైక్రోసాఫ్ట్ 365(వన్ డ్రైవ్).. ఇది ఫ్రీ మాత్రం కాదు. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్లు ఏడాదికి 4,899రూ. చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు 1 టీబీ స్టోరేజ్ ఇస్తారు. ఇందులో 6,199రూ.లతో ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంటుంది. వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్, అవుట్‌లుక్ అప్లికేషన్స్ ప్రీమియం ప్రొడక్టులను కూడా పొందవచ్చు. యాపిల్ వన్ ఇండియా ప్లస్.. యాపిల్ వన్ ఇండియా ప్లాన్స్‌ను మొత్తం కుటుంబం ఉపయోగించుకోవచ్చు. నెలకు 365రూ.లతో ఆరుగురు 200 జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్‌ను వాడుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ఫ్లస్, యాపిల్ ఆర్కేడ్ సర్వీసులతో పాటు 50జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్ కూడా దక్కుతుంది. కాకపోతే 195రూ. నెలవారీ ప్లాన్ తీసుకోవాలి. యాపిల్ రెగ్యులర్ యూజర్లు మాత్రం 177రూ. వరకు సేవ్ చేసుకోవచ్చు.| గూగుల్ ఫొటోస్ గురించి ఈ జాగ్రత్తలు తెలుసుకోండి! -
మైక్రోసాఫ్ట్ నుంచి ఆఫీస్ 2016
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా ఆఫీస్ 365 సాఫ్ట్వేర్ ప్యాకేజికి లేటెస్ట్ వెర్షన్ ఆఫీస్ 2016ని ప్రవేశపెట్టింది. వ్యాపార సంస్థలకు ఇది స్టాండర్డ్, ప్రొఫెషనల్ ప్లస్ ఫార్మాట్లలో లభిస్తుంది. ధర రూ. 24,844-రూ. 33,911గా ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మధ్య స్థాయి ప్యాకేజీ విద్యార్థుల కోసం పర్పెచ్యువల్ ప్యాకేజీ ధర రూ. 5,999, బిజినెస్ ఎడిషన్ రేటు రూ. 18,499గా ఉంటుందని పేర్కొంది. ఆఫీస్ 365ని ఇప్పటికే ఉపయోగిస్తున్న యూజర్లకు కొత్త ఆఫీస్ 2016 యాప్స్‌ను ఉచితంగా అందిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డివిజన్ (ఇండియా) డెరైక్టర్ అలోక్ లాల్ తెలిపారు. 1 టెరా బైట్ వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజితో ఆఫీస్ 2016 లభిస్తుందని వివరించారు. విరివిగా వినియోగంలో ఉన్న వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్, అవుట్‌లుక్, యాక్సెస్ వంటి ప్రోగ్రామ్‌లు ఆఫీస్ 2016 యాప్స్‌లో ఉంటాయి. క్లౌడ్ ఆధారిత ఆఫీస్ 365 సబ్స్క్రిప్షన్ ఫీజు వార్షికంగా రూ. 3,299 (ఒక్క యూజరు) నుంచి రూ. 33,911 (ప్రొఫెషనల్ ప్లస్) దాకా ఉంటుంది. -
భారత్‌లో క్లౌడ్ మార్కెట్ @ 2 లక్షల కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీకి అపార అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దేశంలో ఈ మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల డాలర్లు(రూ.120 లక్షల కోట్లు)గా ఆయన అంచనా వేశారు. ఊరిస్తున్న ఇంత భారీ మార్కెట్ అవకాశాలను చేజ్కించుకోవడం కోసం భారత్‌పై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. 2015 కల్లా మూడు నగరాల్లో క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని.. వాణిజ్యపరమైన క్లౌడ్ సేవలను(అజూర్, ఆఫీస్ 365 ఇతరత్రా) వీటిద్వారా అందిస్తామని సత్య వెల్లడించారు. మంగళవారమిక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను తెలిపారు. సీఈఓగా భారత్‌కు తొలిసారి వచ్చిన సత్య... హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్లో ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తు అంతా క్లౌడ్ టెక్నాలజీదేనని.. దీనికి అప్‌గ్రేడ్ కావాలని కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతేడాది 100 శాతం వ్యాపార వృద్ధి... గతేడాది భారత్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బిజినెస్ 100 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ విజయ ప్రస్థానంతో స్థానిక డేటా సెంటర్లనుంచే క్లౌడ్ సేవలను అందించాలని నిర్ణయించినట్లు సత్య వివరించారు. స్థానిక డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెలకొల్పడంతోపాటు ఉత్పాదకతను పెంచేందుకు... దేశీయంగా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. ‘25 కోట్ల మందికిపైగా భారతీయులు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న మొబైల్స్ ఇతరత్రా డివెజైస్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ క్లౌడ్ టెక్నాలజీతో ముడిపడినవే. భవిష్యత్తులో క్లౌడ్ లేని మొబైల్స్‌ను ఊహించలేం. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలకు ఇంత భారీ డిమాండ్, అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఎంట్రప్రెన్యూర్స్ కూడా క్లౌడ్ మార్కెట్‌కు వరంగా మారుతున్నారు. ఇప్పటికే 10,000 మందికిపైగా పార్ట్నర్స్ మైక్రోసాఫ్ట్‌కు ఉన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచుకుంటాం’ అని సత్య పేర్కొన్నారు. ఎంతమేర పెట్టుబడులను పెట్టనున్నారనేది నిర్దిష్టంగా వెల్లచడించలేదు. అయితే, తొలి అడుగులే అయినప్పటికీ అత్యున్నతస్థాయిలో ఉంటాయని సత్య చెప్పడం గమనార్హం. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతానికి తాము నెలకొల్పబోయే స్థానిక క్లౌడ్ డేటా సెంటర్లు దోహదపడతాయని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు. ఈ-గవర్నెన్స్, అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), విద్య, ఆరోగ్యసంరక్షణ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందన్నారు.