వచ్చే జూన్‌ నుంచి గూగుల్‌ కొత్త పాలసీ | Google New Policy For Inactive Accounts To Delete Content | Sakshi
Sakshi News home page

ఇనాక్టివ్‌ ఖాతాల్లో ఇక డేటా డిలీట్‌!

Published Mon, Nov 16 2020 1:37 PM | Last Updated on Mon, Nov 16 2020 2:09 PM

Google New Policy For Inactive Accounts To Delete Content - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల సౌలభ్యం కోసం వారి  ఖాతాలో జీ మెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌లోని క్రియా రహితంగా, పరిమితికి మించి ఉన్న వాటి కోసం టెక్‌ దిగ్గజం గూగూల్‌ కొత్త పాలసీ తీసుకురానుంది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి అమల్లోకి రానున్న గూగుల్‌ కొత్త పాలసీతో డాక్స్‌, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్‌లు, జూమ్‌బోర్డు ఫైల్స్‌, ఫొటో పరిశ్రమలకు సేవలు ఇక నుంచి సాధారణ పద్ధతులతో మరింత మెరుగ్గా ఉంటాయని గూగుల్‌ తెలిపింది. వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్‌ తొలగించనుంది.

అదేవిధంగా మీ స్టోరేజీ పరిమితి రెండేళ్లు దాటినట్లయితే జీమెయిల్‌, డ్రైవ్‌, ఫోటోల్లో కంటెంట్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. మేమేదైనా కంటెంట్‌ తొలగించడానికి ముందు మీకు చాలా సార్లు సమాచారం ఇస్తామని పేర్కొంది. అందువల్ల మీరు ఆలోపే స్పందించే అవకాశం ఉంటుందని గూగుల్‌ వెల్లడించింది. మీ ఖాతాను చురుగ్గా ఉంచడానికి మీరు ఎప్పటికప్పుడు జీమెయిల్‌, డ్రైవ్‌‌, ఫొటోలను చూస్తూ ఉండాలని సూచించింది. సైన్‌ ఇన్‌ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్‌ కనెక్ట్‌ చేశారని గూగుల్‌ ఒక రికార్డు చేసుకుంటుందని తెలిపింది. ఇనాక్టివ్‌ అకౌంట్‌ మేనేజర్‌ నిర్ధిష్ట కంటెంట్‌ను నిర్వహించడానికి  మీకు సహయ పడుతుందని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement