జతకట్టిన గూగుల్, వాట్సాప్
కాలిఫోర్నియా : ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లు డేటా స్టోరేజీ విషయంలో కొత్త అప్‌డేట్ తీసుకొచ్చాయి. వాట్సాప్ డేటా స్టోరేజీ విషయంలో తమ యూజర్లకు ఇబ్బందులు కలగకుండా వాట్సాప్, గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. కొత్త అప్‌డేట్‌తో గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ డేటాను బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోని స్టోరేజీని వాడుకోదు. వాట్సాప్ బ్యాకప్ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్‌లో ప్రత్యేకంగా సేవ్ అవుతాయి.
ఒక్కో అకౌంట్‌కు గూగుల్ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ డ్రైవ్‌ను వాట్సాప్ బ్యాకప్‌కి వాడితే ఈ 15 జీబీలో నుంచే స్టోరేజీని వాడేసుకునేది. ఈ ఏడాది నవంబర్ 12 నుంచి రానున్న కొత్త అప్‌డేట్‌తో వాట్సాప్ బ్యాకప్‌కి గుగుల్ డ్రైవ్‌లోని స్టోరేజీని వాడకుండా, ప్రత్యేకంగా వాట్సప్ డేటా స్టోర్ అవుతుంది. దీనికి సంబంధించి గూగుల్ డ్రైవ్‌తో వాట్సాప్ ఒప్పందం చేసుకుంది. వాట్సాప్ డేటాని గుగుల్ డ్రైవ్‌లో బ్యాకప్‌కి వాడితే ఎంత మేర డేటాను ఉచితంగా స్టోరేజీకి వాడుకొవొచ్చు అనే విషయంలో స్పష్టత రావాల్సిఉంది.
అయితే కొత్త మార్పులతో ఏడాది, లేదా అంత కన్నా ఎక్కువ కాలం బ్యాకప్ అప్షన్ వాడనట్టయితే గూగుల్ డ్రైవ్‌లో ఇంతకు ముందు సేవ్ చేసిన వాట్సాప్ డేటా ఆటోమెటిక్‌గా డెలీట్ చేయనున్నట్టు వాట్సాప్ తెలిపింది. డేటా డెలీట్ కాకుండా ఉండాలంటే అక్టోబర్ 30 లోపు మ్యానువల్‌గా వాట్సప్ బ్యాకప్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది.
గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ బ్యాకప్ ఎలా చేయాలంటే..
► ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి
► మెనూలో క్లిక్ చేయాలి.
► సెట్టింగ్స్‌లో చాట్స్‌పై క్లిక్ చేయండి
►చాట్ బ్యాకప్ క్లిక్ చేయండి
► చాట్ హిస్టరీని సేవ్ చేయాలనుకున్న గూగుల్ అకౌంట్‌ని సెలక్ట్ చేసుకోండి(వీడియోలు కూడా బ్యాకప్ కావాలను కుంటే ఇన్‌క్లూడ్ వీడియోస్ క్లిక్ చేయండి)
► బ్యాకప్ నొక్కితే మీ వాట్సాప్‌లోని డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. వాట్సప్ డేటా బ్యాకప్ రెగ్యులర్‌గా చేసుకోవాలనుకుంటే అక్కడే అప్షన్స్(డెయిలీ, వీక్లీ, మంథ్లీ) కూడా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment