ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఇన్వెసర్లను మైమరిపిస్తున్న ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండటం ఉత్తమని మార్కెట్ విశ్లేషకులు జిమిత్‌మోదీ అంటున్నారు. అయితే ఆశాహన అంచనాలకు కలిగి ఉండే ఇన్వెసర్లు ప్రైవేట్ బ్యాంక్స్, అటో, మెటల్ షేర్లలో చిన్న పరిమాణంలో కొనుగోలు చేయడం ఉత్తమమని ఆయన సలహానిస్తున్నారు. రాబోయే 3-6 నెలల్లో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయననే ‘ఆశలు’ మార్కెట్లను నడిపించే ఏకైక అంశం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఆయా కంపెనీల యాజమాన్య వ్యాఖ్యలను పరిశీలిస్తే.., జూన్ క్వార్టర్ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవచ్చనే విషయం అవగతమవుతోందని మోదీ తెలిపారు. దురదృష్టవశాత్తు మార్కెట్ ఇప్పటికే ఈ అంశాన్ని డిస్కౌంట్ చేసుకుందని, ఈ జూన్ క్వార్టర్ మార్కెట్ చరిత్రలో చీకటి త్రైమాసికంగా మిగిలిపోవచ్చని ఆయన తెలిపారు. త్రైమాసిక ఫలితాల ప్రకటన తరువాత కంపెనీలు టాప్ లైన్, బాటమ్ లైన్ గణాంకాల్లో భారీ క్షీణతతో మార్కెట్లు కరెక‌్షన్ గురికావచ్చు. ఈ పతన సమయంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం ఉత్తమం. అందువల్ల కంపెనీల ఎఫ్‌వై 2021 మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యే వరకు స్టాక్‌మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా స్టాక్ మార్కెట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ వారం ప్రధాన ఈవెంట్
జియో ఫ్లాట్‌ఫామ్‌లో వాటా విక్రయం, రైట్స్ ఇష్యూ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అతికొద్ది సమయంలో రూ.1.70లక్షల కోట్లను సమీకరించగలిగింది. ఫలితంగా రిలయన్స్ షేరు ఈ వారంలో సరికొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసి భారీ లాభాల్ని అర్జించింది. నిఫ్టీ ఇండెక్స్‌లో ఆర్‌ఐఎల్ అధిక వెయిటేజీ కలిగిన షేరు కావడంతో మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్‌గా మారింది. అలాగే సెనెక్స్, నిఫ్టీలను లాభాలతో ముగిసేలా చేసింది. కాబట్టి ఆర్‌ఐఎల్ ఈ వారం ఎక్చ్సేంజీలు నష్టపోకుండా కాపలాదారుగా వ్యవహరించిందని చెప్పువచ్చు. ఆర్‌ఐఎల్ ఈవెంట్ లేకపోతే తక్కువ ధరలు, నెగటివ్ సెంటిమెంట్‌లతో సూచీలు నష్టాలను మూటగట్టుకునేవి.
నిఫ్టీ టెక్నికల్ అవుట్‌లుక్
వారం ప్రారంభంలో నిఫ్టీ ఒడిదుడుకులను చవిచూసినప్పటికీ.., వారాంతాన్ని లాభంతో ముగించింది. ఇప్పడు ఈ ఇండెక్స్ 3వారాల ట్రేడింగ్ శ్రేణి అప్పర్ ఎండ్‌పై కదలాడుతుంది. వరుసగా 2వారాల పాటు పొడవైన షాడో సంభవించడంతో ఈ జోన్లో అమ్మకందారులు అందుబాటులో ఉన్నారనడానికి సంకేతంగా నిలిచింది. రానున్న రోజుల్లో నిఫ్టీ ర్యాలీకి 10,100-10,500 పరిధి అత్యంత కీలకమైన నిరోధం అవుతోంది. అప్‌సైడ్ ట్రెండ్‌లో ఈ విస్తృత పరిధిలో కదలాడే అవకాశం ఉంది. ఇక డౌన్‌సైడ్‌లో 9,550 వద్ద కీలకమైన మద్దతు స్థాయి ఉంది.
వచ్చేవారం అంచనాలు
జాతీయ, అంతర్జాతీయంగా మార్కెట్ ప్రభావితం చేసే కీలక సంఘటనలు ఏవీ లేకపోవడంతో వచ్చే వారంలో సూచీలు కన్సాలిడేట్ కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిమితుల సడలింపుతో నెలకొన్న డిమాండ్... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఎలా సహాయపడుతుందో అనే అంశాన్ని డీ-కోడ్ చేయడానికి మార్కెట్లు ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా, ప్రస్తుత తీరుతెన్నులను పరిశీలిస్తే రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు నెలకొనవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment